కంటెంట్‌కు వెళ్లండి
కీర్తనలు 35:19-28

న్యాయము మరియు నిర్దోషిత్వము కొరకు చివరి విన్నపము

కీర్తనలు 35:19-28
19
కారణం లేకుండా నాకు శత్రువులైనవారిని నన్ను చూసి సంతోషించనివ్వకండి. కారణం లేకుండా నన్ను ద్వేషించేవారు దురుద్దేశంతో కన్నుగీట నివ్వకండి.
20
వారు సమాధానంగా మాట్లాడరు, దేశంలో ప్రశాంతంగా నివసించే వారిపై తప్పుడు ఆరోపణలు చేస్తారు.
21
వారు నన్ను వెక్కిరిస్తూ “ఆహా! ఆహా! మా కళ్లతో మేము చూశాం” అని అంటారు.
22
యెహోవా, ఇదంతా మీరు చూశారు; మౌనంగా ఉండకండి. ప్రభువా, నాకు దూరంగా ఉండకండి.
23
మేల్కొనండి, నన్ను రక్షించడానికి లేవండి! నా దేవా, నా ప్రభువా, నా పక్షాన వాదించండి.
24
యెహోవా, నా దేవా! మీ నీతిని బట్టి నాకు న్యాయం తీర్చండి; నన్ను బట్టి వారిని ఆనందించనివ్వకండి.
25
“ఆహా, మేము కోరుకున్నదే జరిగింది!” అని అనుకోనివ్వకండి, “మేము అతన్ని మ్రింగివేశాం” అని అననివ్వకండి.
26
నా బాధను చూసి ఆనందిస్తున్న వారందరు అవమానంతో సిగ్గుపడాలి; నా మీద గర్వించే వారందరు సిగ్గుతో అపకీర్తి పాలవుదురు గాక.
27
నా నిర్దోషత్వాన్ని బట్టి ఆనందించేవారు ఆనంద సంతోషాలతో కేకలు వేయుదురు గాక; “తన సేవకుని క్షేమాన్ని చూసి ఆనందించే యెహోవా ఘనపరచబడును గాక” అని వారు నిత్యం అందురు గాక.
28
నా నాలుక మీ నీతిని ప్రకటిస్తుంది, దినమంతా మిమ్మల్ని స్తుతిస్తుంది.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options