Skip to content
కీర్తనలు 31:2-13

కీర్తనలు 31:2-13

2
మీరు నా వైపు చెవియొగ్గి, నన్ను విడిపించడానికి త్వరగా రండి; నా ఆశ్రయదుర్గమై, బలమైన కోటవై నన్ను కాపాడండి.
3
మీరు నా కొండ, నా కోట; మీ నామాన్ని బట్టి నన్ను నడిపించండి.
4
నా కోసం ఏర్పాటు చేయబడిన ఉచ్చులో పడకుండ నన్ను తప్పించండి, ఎందుకంటే మీరు నా ఆశ్రయమై ఉన్నారు.
5
మీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. యెహోవా నా నమ్మకమైన దేవా, నన్ను విడిపించండి.
6
విగ్రహాలను వెంబడించే వారిని నేను అసహ్యించుకుంటాను; నేనైతే యెహోవాలో నమ్మకముంచాను.
7
మీ మారని ప్రేమలో నేను ఆనందించి సంతోషిస్తాను, నా బాధను మీరు చూశారు నా వేదన మీకు తెలుసు.
8
మీరు నన్ను శత్రువుల చేతికి అప్పగించలేదు నా పాదాలను విశాలమైన స్థలంలో ఉంచారు.
9
యెహోవా, నేను బాధలో ఉన్నాను నన్ను కరుణించండి; నా కళ్లు విచారంతో బలహీనం అవుతున్నాయి, నా ప్రాణం దేహం దుఃఖంతో క్షీణిస్తున్నాయి.
10
నా బ్రతుకు వేదనలో గడుస్తుంది నిట్టూర్పులతో నా సంవత్సరాలు గతించిపోతున్నాయి. నా పాపాన్ని బట్టి నా బలమంతా హరించుకు పోతోంది, నా ఎముకల్లో సత్తువలేదు.
11
నా శత్రువులందరి కారణంగా పొరుగువారు నన్ను ఎగతాళి చేస్తున్నారు నన్ను చూసి నా స్నేహితులు భయపడుతున్నారు వీధిలో నన్ను చూసేవారు నా నుండి పారిపోతున్నారు.
12
చనిపోయిన వాడిగా నన్ను మరచిపోయారు; నేను పగిలిన కుండలా అయ్యాను.
13
అనేకమంది గుసగుసలాడడం నేను విన్నాను, “అన్నివైపులా భయమే!” నామీద వారు దురాలోచన చేస్తున్నారు నా ప్రాణం తీయాలని కుట్ర పన్నుతున్నారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options