సామెతలు 5:1-16
1
నా కుమారుడా, జ్ఞానంగల నా మాటలు విను, అంతరార్థం గల నా మాటలకు నీ చెవిని త్రిప్పు,
2
అప్పుడు నీవు విచక్షణ కలిగి ఉంటావు నీ పెదవులు తెలివిని కాపాడతాయి.
3
వ్యభిచారం చేసే స్త్రీ పెదవులు తేనె బిందువులాంటివి, దాని నోరు నూనె కంటే నునుపైనది;
4
కాని చివరకు అది పైత్యరసమంత చేదుగా, రెండంచులు గల ఖడ్గమంత పదునుగా ఉంటుంది.
5
దాని పాదాలు మరణానికి దిగుతాయి; దాని అడుగులు నేరుగా సమాధి వైపుకు వెళ్తాయి.
6
అది జీవన విధానానికి ఎటువంటి ఆలోచన ఇవ్వదు; దాని మార్గాలు లక్ష్యం లేకుండా తిరుగుతాయి, కానీ దానికి ఆ విషయం తెలియదు.
7
నా కుమారులారా, నా మాట ఆలకించండి; నేను చెప్పే వాటినుండి ప్రక్కకు తొలగవద్దు.
8
దానికి దూరంగా ఉన్న దారిలో ఉండండి, దాని ఇంటి తలుపు దగ్గరకు వెళ్లవద్దు,
9
పరులకు మీ వైభవాన్ని ఇవ్వవద్దు, మీ హుందాతనాన్ని క్రూరులకు ఇవ్వవద్దు.
10
అపరిచితులు మీ సంపదను తినివేయకూడదు మీ శ్రమ మరొకరి ఇంటిని సుసంపన్నం చేయకూడదు.
11
మీ జీవితం చివరి దశలో మీ దేహం, మాంసం క్షీణించినప్పుడు మీరు మూల్గుతారు.
12
అప్పుడు మీరంటారు, “నేను క్రమశిక్షణను అసహ్యించుకోవడమేంటి! నా హృదయం దిద్దుబాటును తిరస్కరించడమేంటి!
13
నేను నా బోధకులకు లోబడలేదు, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గ లేదు.
14
సర్వసమాజం మధ్య నేను దాదాపు పతనానికి వచ్చాను అనుకుంటూ బాధపడతారు.”
15
మీ సొంత కుండలోని నీళ్లను త్రాగండి, మీ సొంత బావిలో నుండి వచ్చే నీటినే త్రాగండి.
16
మీ ఊటలు వీధుల్లో పొంగిపోవచ్చునా? వీధుల్లో అవి నీటి కాలువలుగా పారవచ్చునా?
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.
Settings