సామెతలు 22:17-34
17
చెవియొగ్గి జ్ఞానుల సూక్తులను వినండి; నేను ఉపదేశించే దానికి మీ హృదయాన్ని వర్తింపజేయండి.
18
ఎందుకంటే వాటిని మీ హృదయంలో ఉంచడం వాటన్నిటిని మీ పెదవుల మీద ఉంచడం మంచిది.
19
మీ నమ్మకం యెహోవా మీద ఉండాలని, నేను ఈ రోజున వీటిని మీకు, మీకే బోధిస్తున్నాను.
20
మీరు నిజాయితీగా ఉండాలని సత్యాన్ని మాట్లాడాలని తద్వారా మిమ్మల్ని పంపినవారికి మీరు సరియైన నివేదిక ఇవ్వాలని, సలహాలతో తెలివితో కూడిన, ముప్పది సూక్తులను నేను మీ కోసం వ్రాయలేదా?
22
పేదవారు కదా అని పేదవారిని పీడించవద్దు అవసరతలో ఉన్నవారిని ఆవరణంలో అణచివేయవద్దు,
23
యెహోవా వారి వైపున వాదిస్తారు ఎవరైనా వారిని పతనం చేసేవారిని ఆయన పతనం చేస్తారు.
24
కోపిష్ఠియైన వ్యక్తితో స్నేహం చేయవద్దు, ఊరకనే కోప్పడే వ్యక్తితో సహవాసం చేయవద్దు,
25
నీవు వాని మార్గాలను అనుసరించి నీ ప్రాణానికి ఉరి తెచ్చుకుంటావేమో.
26
చేతిలో చేయి వేసి ప్రతిజ్ఞ చేసేవారితో గాని అప్పులకు పూటబడే వారితో జత కట్టవద్దు;
27
ఇవ్వడానికి నీయొద్ద ఏమీ లేకపోతే, వాడు నీ క్రిందనుండి నీ పరుపునే తీసుకెళ్తాడు.
28
నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు.
29
తన పనిలో నేర్పరితనం గల వానిని చూశావా? అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలబడతాడు.
Settings