Skip to content
సామెతలు 17:7-14

సామెతలు 17:7-14

7
అనర్గళమైన పెదవులు దైవభక్తి లేని బుద్ధిహీనునికి సరిపోవు, అధికారికి అబద్ధమాడే పెదవులు ఇంకెంత ఘోరం!
8
లంచమిచ్చేవానికి లంచం ఒక మంత్ర రాయిలా ఉంటుంది, ప్రతి మలుపు దగ్గర విజయం వస్తుందని వారు తలస్తారు.
9
ప్రేమను పెంచాలని కోరేవారు నేరాలు దాచిపెడతారు, జరిగిన వాటిని మాటిమాటికి జ్ఞాపకం చేసేవాడు గాఢ స్నేహితులను విడగొడతారు.
10
బుద్ధిహీనునికి పడే వంద దెబ్బల కంటే, వివేకంగల వానికి ఒక గద్దింపు ప్రభావం చూపుతుంది.
11
ఎదిరించువాడు కీడు చేయుటకే కోరును, అట్టివాని వెంట దయలేని దూత పంపబడును.
12
మూర్ఖత్వానికి లొంగిన బుద్ధిహీనుని కలవడం కంటే పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటిని కలవడం మేలు.
13
మేలుకు బదులుగా కీడు చేయువాని ఇంట నుండి కీడు ఎన్నటికి తొలిగిపోదు.
14
గొడవ ప్రారంభించడం ఆనకట్టకు గండి కొట్టడం లాంటిది; కాబట్టి వివాదం చెలరేగడానికి ముందే ఆపండి.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options