సామెతలు 17:15-22
15
దోషులను వదిలి వేయడం అమాయకులను ఖండించడం, రెండు యెహోవాకు అసహ్యమే.
16
బుద్ధిహీనులు జ్ఞానాన్నే గ్రహించలేకపోతున్నప్పుడు, వారి విద్యాభ్యాసానికి డబ్బు చెల్లించడం దేనికి?
17
నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, ఆపదల్లో అట్టి వాడు సహోదరునిగా ఉంటాడు.
18
బుద్ధిలేని మనుష్యుడు చేతిలో చేయి వేసి ప్రతిజ్ఞ చేస్తాడు పొరుగువానికి హామీగా ఉంటాడు.
19
తగాదాను ప్రేమించేవాడు పాపాన్ని ప్రేమిస్తాడు, తన వాకిండ్లు ఎత్తు చేయువాడు నాశనం వెదుకువాడు.
20
అసూయగలవాడు మేలుపొందడు తెలివితక్కువగా మాట్లాడేవాడు కీడులో పడును.
21
మూర్ఖుని కనిన వానికి విచారం కలుగుతుంది, బుద్ధిహీనుని కనిన తండ్రికి సంతోషం ఉండదు.
22
సంతోషం గల హృదయం ఆరోగ్యకారణం, నలిగిన హృదయం ఎముకలను ఎండిపోజేస్తుంది.
Settings