Skip to content
నెహెమ్యా 2:1-5

నెహెమ్యా 2:1-5

1
అర్తహషస్త రాజు పాలనలో ఇరవయ్యవ సంవత్సరం నీసాను నెలలో, రాజు కోసం ద్రాక్షరసం తీసుకువచ్చినప్పుడు నేను ద్రాక్షారసాన్ని తీసుకుని రాజుకు ఇచ్చాను. అంతకుముందు నేను వారి ముందు ఎప్పుడు బాధపడలేదు.
2
కాబట్టి రాజు, “నీవు అనారోగ్యంగా లేవు కదా, మరి నీ ముఖం ఎందుకు విచారంగా ఉంది? ఇది హృదయంలో ఉన్న విచారమే తప్ప మరొకటి కాదు” అని అన్నారు. అప్పుడు నేను చాలా భయపడ్డాను, కాని
3
నేను రాజుతో, “రాజు చిరకాలం జీవించును గాక! నా పూర్వికులను పాతిపెట్టిన పట్టణం శిథిలావస్థలో ఉండి, దాని ద్వారాలు అగ్నికి ఆహుతి అయినప్పుడు నా ముఖం ఎందుకు విచారంగా కనిపించకూడదు?” అన్నాను.
4
అప్పుడు రాజు, “నీకు ఏమి కావాలి?” అని అడిగాడు. నేను పరలోకపు దేవునికి ప్రార్థనచేసి,
5
రాజుతో, “రాజా, మీకు ఇష్టమైతే మీ సేవకుడనైన నాపై దయ చూపించండి. మా పూర్వికుల సమాధులున్న పట్టణాన్ని తిరిగి కట్టడానికి నన్ను యూదా దేశానికి పంపండి” అని అడిగాను.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options