Skip to content
న్యాయాధిపతులు 21:16-24

న్యాయాధిపతులు 21:16-24

16
అప్పుడు సమాజపెద్దలు, “బెన్యామీను గోత్రంలో స్త్రీలు లేకుండా నాశనమై పోయినందుకు, వారిలో మిగిలిన వారిని భార్యలను ఎలా తేగలం?
17
ఇశ్రాయేలు గోత్రాల్లో ఒక గోత్రం తుడిచిపెట్టుకుపోకుండ బెన్యామీను గోత్రంలో మిగిలిన వారికి వారసులుండాలి.
18
వారికి మన కుమార్తెలను భార్యలుగా ఇవ్వలేం, ఎందుకంటే ఇశ్రాయేలీయులమైన మనం, ‘ఎవరైనా బెన్యామీనీయునికి తమ కుమార్తెను భార్యగా ఇస్తే వారు శాపగ్రస్తులు’ అని ప్రమాణం చేశాము.
19
అయితే చూడండి, షిలోహులో యెహోవాకు సంవత్సర పండుగ జరుగుతుంది; షిలోహు బేతేలుకు ఉత్తరాన, బేతేలు నుండి షెకెముకు వెళ్లే దారికి తూర్పున, లెబోనాకు దక్షిణాన ఉన్న షిలోహులో యెహోవాకు సంవత్సర పండుగ జరుగుతుంది” అని అన్నారు.
20
అప్పుడు వారు బెన్యామీనీయులను ఇలా ఆదేశించారు: “అక్కడికి వెళ్లి ద్రాక్షతోటల్లో దాక్కుని
21
వేచి ఉండండి. షిలోహు నుండి యువతులు నాట్యంలో పాల్గొనడానికి వస్తున్నప్పుడు, మీరు ద్రాక్షతోటల్లో నుండి త్వరగా వచ్చి, ప్రతివాడును షిలోహు యువతులలో ఒక యువతిని పెళ్ళి చేసుకోడానికి తీసుకెళ్లండి. తర్వాత బెన్యామీను ప్రదేశానికి తిరిగి వెళ్లండి.
22
వారి తండ్రులు గాని సోదరులు గాని మా దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేస్తే, మేము వారితో, ‘యుద్ధ సమయంలో వారికి మేము భార్యలను తీసుకురాలేదు, కాబట్టి మీరు మా పట్ల దయచూపి వారికి సహాయం చెయ్యండి. మీ అంతట మీరు మీ కుమార్తెలను వారికివ్వలేదు, కాబట్టి మీరు ప్రమాణం విషయంలో అపరాధులు కారు’ అని చెప్తాము.”
23
కాబట్టి బెన్యామీనీయులు అలాగే చేశారు. యువతులు నాట్యం చేస్తూ ఉంటే, ఒక్కొక్కడు ఒక్కొక్క యువతిని పట్టుకుని తనకు భార్యగా చేసుకున్నాడు. తర్వాత వారు తమ వారసత్వ భూమికి తిరిగివెళ్లి పట్టణాలను మళ్ళీ కట్టి వాటిలో స్థిరపడ్డారు.
24
ఆ తర్వాత ఇశ్రాయేలీయులలో ప్రతి ఒక్కరు అక్కడినుండి తమ తమ గోత్రాలకు, వంశాలకు, తమ వారసత్వ భూమికి వెళ్లిపోయారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options