Skip to content
న్యాయాధిపతులు 21:8-15

న్యాయాధిపతులు 21:8-15

8
తర్వాత వారు, “ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలో నుండి మిస్పాలో యెహోవా ఎదుట సమావేశం కాని గోత్రమేది?” అని అడిగారు. చివరకు యాబేషు గిలాదు నుండి ఎవ్వరూ సమావేశానికి రాలేదని తెలుసుకున్నారు.
9
ప్రజలందరినీ లెక్కపెట్టినప్పుడు, యాబేషు గిలాదు నుండి ఏ ఒక్కరూ అక్కడ కనిపించలేదు.
10
అప్పుడు సమాజం పన్నెండువేలమంది యుద్ధవీరులను యాబేషు గిలాదుకు పంపతూ, అక్కడికి వెళ్లి అక్కడి వారినందరిని, స్త్రీలు పిల్లలతో సహితం ఖడ్గంతో చంపాలని ఆదేశించారు.
11
వారు, “మీరు ఏం చేయాలంటే, ప్రతి పురుషుని, కన్య కాని ప్రతి స్త్రీని నాశనం చేయండి” అని వారు అన్నారు.
12
వారు అక్కడ యాబేషు గిలాదు ప్రజల్లో పురుషులతో పడుకోని నాలుగువందలమంది యువతులను కనుగొన్నారు, వారిని కనానులోని షిలోహు దగ్గర ఉన్న శిబిరానికి తీసుకెళ్లారు.
13
అప్పుడు సమాజమంతా రిమ్మోను బండ దగ్గర ఉన్న బెన్యామీనీయులతో సమాధానపడదాం అని కబురు పంపారు.
14
ఆ సమయంలో బెన్యామీనీయులు తిరిగి వచ్చారు, యాబేషు గిలాదు స్త్రీలలో బ్రతకనిచ్చినవారిని వారికిచ్చి పెళ్ళిళ్ళు చేశారు. అయితే వారందరికీ ఆ స్త్రీలు సరిపోలేదు.
15
యెహోవా ఇశ్రాయేలు గోత్రాల్లో లోపం కలుగజేశారని ప్రజలు బెన్యామీను విషయం బాధపడ్డారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options