Skip to content
న్యాయాధిపతులు 20:1-7

న్యాయాధిపతులు 20:1-7

1
అప్పుడు ఇశ్రాయేలీయులందరు, దాను నుండి బెయేర్షేబ వరకు ఉన్నవారు, గిలాదు ప్రదేశంలో ఉన్నవారు, అంతా ఏకమై మిస్పా దగ్గర యెహోవా సన్నిధిలో సమావేశమయ్యారు.
2
ఇశ్రాయేలు గోత్రాలన్నిటి నాయకులు, నాలుగు లక్షలమంది ఆయుధాలు కలిగి దేవుని ప్రజల సమావేశానికి హాజరయ్యారు.
3
ఇశ్రాయేలీయులు మిస్పాకు వెళ్లారని బెన్యామీనీయులు విన్నారు. అప్పుడు ఇశ్రాయేలీయులు, “ఈ నీచమైన పని ఎలా జరిగిందో మాకు చెప్పండి” అన్నారు.
4
చంపబడిన స్త్రీ భర్తయైన లేవీయుడు మాట్లాడుతూ అన్నాడు, “నేను, నా ఉంపుడుగత్తె రాత్రి గడుపుదామని బెన్యామీనులోని గిబియాకు వచ్చాము.
5
రాత్రివేళ గిబియా నాయకులు నా వెంటపడి నన్ను చంపాలనుకొని ఇంటిని చుట్టుముట్టారు. వారు నా ఉంపుడుగత్తెను మానభంగం చేయగా ఆమె చనిపోయింది.
6
ఇశ్రాయేలులో ఇలాంటి దుర్మార్గం, అవమానకరమైన పనివారు చేశారు కాబట్టి నా ఉంపుడుగత్తెను తీసుకెళ్లి ఆమెను ముక్కలుగా చేసి ఒక్కొక్క ముక్కను ఇశ్రాయేలీయుల వారసత్వ ప్రాంతాలకు పంపాను.
7
ఇప్పుడు, ఇశ్రాయేలీయులైన మీరంతా మాట్లాడి ఏమి చేయాలని నిర్ణయించారో చెప్పండి” అన్నాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options