కంటెంట్‌కు వెళ్లండి
యోబు 7:11-16

తీవ్రముగా ఫిర్యాదు చేయాలని యోబు నిర్ణయించుట

యోబు 7:11-16
11
“కాబట్టి నేను మౌనంగా ఉండను; నా ఆత్మలోని వేదన బట్టి మాట్లాడతాను. నా మనస్సులోని బాధను బట్టి నేను ఫిర్యాదు చేస్తాను.
12
మీరు నాకు కాపలా పెట్టడానికి నేనేమైనా సముద్రాన్నా లేదా సముద్రపు క్రూరజంతువునా?
13
నా పడక నాకు ఆదరణ ఇస్తుందని నా మంచం నా బాధను తగ్గిస్తుందని నేను అనుకుంటే,
14
అప్పుడు కూడా కలలతో మీరు నన్ను బెదిరిస్తున్నారు. దర్శనాలతో నన్ను భయపెడుతున్నారు.
15
ఈ శరీరంతో ఇలా జీవించడం కంటే ఊపిరాడకుండా చనిపోవడాన్నే నేను కోరుకుంటాను.
16
నా జీవితాన్ని తృణీకరిస్తున్నాను; నేను ఎల్లకాలం బ్రతకను. నన్ను ఒంటరిగా విడిచిపెట్టండి; నా దినాలు అర్థం లేకుండా ఉన్నాయి.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options