Skip to content
యోబు 39:22-28

యోబు 39:22-28

22
అది భయాన్ని చూసి నవ్వుతుంది, దేనికి భయపడదు; ఖడ్గాన్ని చూసినా వెనుతిరుగదు.
23
మెరుస్తున్న ఈటెలు బరిసెలతో పాటు దాని అంబులపొది గలగలలాడుతుంది,
24
పిచ్చి కోపంలో అది నేల మీద కాలు దువ్వుతుంది; బూరధ్వని విన్నప్పుడు అది ప్రశాంతంగా నిలబడలేదు.
25
బూర మ్రోగగానే అది, ‘ఆహా!’ అని అంటుంది దూరం నుండే యుద్ధవాసన, సేనాధిపతుల కేకలు యుద్ధఘోష పసిగడుతుంది.
26
“దక్షిణదిక్కు వైపుకు తన రెక్కలు చాపి ఎలా ఎగరాలో డేగకు నీ జ్ఞానంతో నేర్పించావా?
27
నీ ఆజ్ఞను బట్టే గ్రద్ద పైకెగిరిపోయి, తన గూడు ఎత్తైన చోటులో కట్టుకుంటుందా?
28
ఎవరు ఎక్కలేని కొండచరియలో నివసిస్తుంది రాత్రివేళ అక్కడే గడుపుతుంది; ఏటవాలుగా ఉన్న బండ దానికి బలమైన కోట.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options