యోబు 37:1-11
1
“వీటన్నిబట్టి నా హృదయం వణికిపోతుంది, దాని స్థలం నుండి దూకుతుంది.
2
ఆయన స్వరం గర్జించడం వినండి, ఆయన నోటి నుండి వచ్చే ఉరుమును వినండి.
3
ఆయన తన మెరుపును ఆకాశమంతటి క్రింద విప్పుతారు దానిని భూమి చివర్లకు పంపుతారు.
4
దాని తర్వాత ఆయన గర్జన శబ్దం వినిపిస్తుంది; ఆయన తన గంభీరమైన స్వరంతో ఉరుముతారు. ఆయన స్వరం ప్రతిధ్వనిస్తున్నప్పుడు, ఆయన ఏది వెనుకకు తీసుకోరు.
5
దేవుని స్వరం అద్భుతమైన విధానాల్లో ఉరుముతుంది; మనం గ్రహించలేని గొప్ప వాటిని ఆయన చేస్తారు.
6
ఆయన మంచుతో, ‘భూమిపై పడు’ వాన జల్లుతో, ‘కుండపోత వర్షంగా కురువు’ అని ఆజ్ఞాపిస్తారు.
7
తద్వార మనుష్యులందరు ఆయన కార్యాన్ని తెలుసుకుంటారు, ఆయన ప్రజలందరినీ తమ ప్రయాసం నుండి విరమింపజేస్తారు.
8
జంతువులు వాటి గుహల్లోకి వెళ్లి వాటిలో దాక్కుని అక్కడే నివసిస్తాయి.
9
తుఫాను దాని స్థానం నుండి బయటకు వస్తుంది, వీచే గాలుల నుండి చలి వస్తుంది.
10
దేవుని ఊపిరి మంచును పుట్టిస్తుంది, మహా సముద్ర ఉపరితలాలు గడ్డకడతాయి.
11
ఆయన దట్టమైన మేఘాలను తేమతో నింపుతారు; మేఘాలలో తన మెరుపులను వ్యాపింపజేస్తారు.
Settings