కంటెంట్‌కు వెళ్లండి
యోబు 32:6-14

ఎలీహు తన జోక్యమును సమర్థించుకొనుట

యోబు 32:6-14
6
బూజీయుడైన బరకెయేలు కుమారుడైన ఎలీహు ఇలా అన్నాడు: నేను వయస్సులో చిన్నవాన్ని, మీరు పెద్దవారు; అందుకే నేను భయపడ్డాను, నేను అనుకున్నది మీతో చెప్పడానికి ధైర్యం చేయలేదు.
7
ముందుగా వయస్సు మాట్లాడాలి; గడచిన సంవత్సరాలు జ్ఞానం బోధించాలని నేననుకున్నాను.
8
అయితే అది ఒక వ్యక్తిలో ఉన్న ఆత్మ, సర్వశక్తిమంతుని ఊపిరి వారికి వివేచన కలిగిస్తుంది.
9
కేవలం వృద్ధులే జ్ఞానులు కారు, పెద్ద వయస్సు వారే వివేచన గలవారని కాదు.
10
కాబట్టి నేను చెప్తున్న: నేను చెప్పేది వినండి; నాకు తెలిసింది మీకు చెప్తాను.
11
మాట్లాడడానికి మీరు మాటల కోసం వెదకుతున్నప్పుడు, మీ మాటల కోసం నేను వేచి ఉన్నాను; నేను మీ అభిప్రాయాలను విన్నాను,
12
మీరు చెప్పేవాటిని నేను జాగ్రత్తగా విన్నాను; అయితే మీలో ఒక్కరు కూడా యోబు తప్పు అని నిరూపించలేదు; అతని వాదనలకు ఎవరూ జవాబు చెప్పలేదు.
13
మాకు జ్ఞానం లభించింది; మనుష్యులు కాదు, దేవుడే అతన్ని తప్పు అని నిరూపించాలని మీరు అనకండి.
14
కాని యోబు నాతో వాదించలేదు, మీ వాదనలతో నేను అతనికి జవాబు ఇవ్వను.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options