Skip to content
యోబు 32:15-22

మాట్లాడవలెననే ఎలీహు అంతరంగ ప్రేరణ

యోబు 32:15-22
15
వారు ఆశ్చర్యపడి ఇక ఏమి చెప్పలేదు; వారికి మాటలు దొరకలేదు.
16
వారు జవాబేమి చెప్పలేదా అలా ఉండిపోయారు, వారు మౌనంగా ఉండగా నేను ఇంకా వేచి ఉండాలా?
17
నేను కూడా చెప్పాల్సింది చెప్తాను; నేను కూడా నాకు తెలిసింది చెప్తాను.
18
ఎందుకంటే నా మనస్సునిండ మాటలున్నాయి, నాలోని ఆత్మ నన్ను బలవంతం చేస్తోంది.
19
నా అంతరంగం మూసివేసిన ద్రాక్షరసం తిత్తిలా ఉంది, క్రొత్త తిత్తివలె అది పగిలిపోవడానికి సిద్ధంగా ఉంది.
20
నేను మాట్లాడి ఉపశమనం పొందాలి; నా నోరు తెరచి సమాధానం ఇస్తాను.
21
నేను పక్షపాతం చూపించను, ఏ మనుష్యుని పొగడను;
22
ఎలా పొగడాలో నాకు చేతకాదు. ఒకవేళ నేను అలా పొగిడితే వెంటనే నా సృష్టికర్త నన్ను చంపుతారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options