Skip to content
యోబు 24:18-24

యోబు 24:18-24

18
“అయినాసరే వారు నీటి మీద నురుగులా ఉన్నారు; వారి భూభాగం శపించబడింది, కాబట్టి ఎవరు వారి ద్రాక్షతోట వైపు వెళ్లరు.
19
వేడి కరువు కరిగిన మంచును లాగివేసినట్టు, పాతాళం పాపం చేసిన వారిని లాగివేస్తుంది.
20
గర్భం వారిని మరచిపోతుంది, పురుగు వారిపై విందు చేసుకుంటుంది; దుష్టులు ఇక జ్ఞాపకంలో ఉండరు, కాని చెట్టు విరిగినట్లు వారు విరిగిపోతారు.
21
వారు గొడ్రాళ్లను పిల్లలు కనని స్త్రీలను బాధితురాళ్లుగా చేస్తారు, విధవరాలి మీద దయ చూపరు.
22
కానీ దేవుడు తన శక్తితో బలవంతులను లాగుతాడు; వారు స్థిరపడినప్పటికీ, వారికి జీవితం మీద నమ్మకం లేదు.
23
భద్రతా భావనతో ఆయన వారిని విశ్రాంతి తీసుకోనిస్తారు, కాని వారి మార్గాలపై ఆయన దృష్టి ఉంచుతారు.
24
వారు కొద్దిసేపు కోసం హెచ్చింపబడతారు, తర్వాత కనుమరుగవుతారు; వారు పతనం చేయబడి అందరిలాగే పోగుచేయబడతారు; పండిన వెన్నులా వారు కోయబడతారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options