Skip to content
యోబు 24:13-17

యోబు 24:13-17

13
“వెలుగుమీద తిరుగుబాటు చేసేవారున్నారు, వారికి దాని మార్గాలు తెలియవు దాని బాటలో వారు నిలువరు.
14
హంతకుడు చీకటి పడగానే లేస్తాడు బీదలను నిరుపేదలను చంపుతాడు, రాత్రివేళ దొంగలా దోచుకొంటాడు.
15
వ్యభిచారి కన్ను సందెచీకటి కోసం ఎదురుచూస్తుంది; ముఖానికి ముసుగు వేసుకుని, ‘నన్ను ఎవరు చూడరు’ అని అనుకుంటాడు.
16
దొంగలు రాత్రివేళ ఇళ్ళకు కన్నం వేస్తారు, పగటివేళ లోపల దాక్కుంటారు; వారికి వెలుగుతో సంబంధం లేదు.
17
వారందరికి, మధ్యరాత్రే వారి ఉదయం; వారు చీకటి భయాలతో స్నేహం చేస్తారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options