కంటెంట్‌కు వెళ్లండి
యోబు 22:21-30

పశ్చాత్తాపము పునరుద్ధరణకు ఎలీఫజు పిలుపు

యోబు 22:21-30
21
“దేవునికి లొంగి ఆయనతో నీవు సమాధానంగా ఉండు; దీనివలన నీకు వృద్ధి కలుగుతుంది.
22
ఆయన నోటి నుండి వచ్చే ఉపదేశాన్ని అంగీకరించు ఆయన మాటలను నీ హృదయంలో నిలుపుకో.
23
ఒకవేళ నీవు సర్వశక్తిమంతుని వైపు తిరిగితే, నీవు మళ్ళీ పునరుద్ధరించబడతావు: నీ గుడారంలో నుండి దుష్టత్వాన్ని నీవు తొలగించి
24
నీ బంగారాన్ని మట్టిలో ఓఫీరు బంగారాన్ని కనుమల రాళ్లలో పారవేస్తే,
25
అప్పుడు సర్వశక్తిమంతుడు నీకు బంగారం, నీకు ప్రశస్తమైన వెండి అవుతాడు.
26
అప్పుడు నీవు ఖచ్చితంగా సర్వశక్తిమంతునిలో ఆనందిస్తావు దేవుని వైపు నీ ముఖాన్ని ఎత్తుతావు.
27
నీవు ఆయనకు ప్రార్థన చేస్తావు, ఆయన నీ మనవి వింటారు, నీవు నీ మ్రొక్కుబడులను చెల్లిస్తావు.
28
నీవు ఏది నిర్ణయించుకొంటే అది నీకు జరుగుతుంది, నీ మార్గాల మీద వెలుగు ప్రకాశిస్తుంది.
29
ప్రజలు తగ్గించబడినప్పుడు, ‘వారిని పైకి లేవనెత్తు!’ అని నీవు అంటావు అప్పుడు ఆయన దీనులను రక్షిస్తారు.
30
నిర్దోషి కాని వానిని కూడా ఆయన విడిపిస్తారు, నీ చేతుల శుద్ధి కారణంగా వారికి విడుదల కలుగుతుంది.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options