యోబు 22:12-20
12
“దేవుడు ఎత్తైన ఆకాశాల్లో లేరా? పైనున్న నక్షత్రాలను చూడు అవి ఎంత ఉన్నతంగా ఉన్నాయి!
13
అయినా నీవు, ‘దేవునికేమి తెలుసు? గాఢాంధకారంలో నుండి ఆయన న్యాయం చెప్పగలడా?
14
ఆకాశమండలం పైన ఆయన తిరుగుచున్నాడు కాబట్టి మేఘాలు ఆయనను కప్పివేశాయి ఆయన చూడలేడు’ అని అంటున్నావు.
15
దుష్టులు నడిచిన పాత మార్గంలోనే నీవు కూడా నడుస్తావా?
16
తమ గడువు తీరకముందే వారు కొనిపోబడ్డారు, వారి పునాదులు వరదల్లో కొట్టుకుపోయాయి.
17
దేవుడు వారి గృహాలను మంచివాటితో నింపినప్పటికి వారు దేవునితో, ‘మమ్మల్ని విడిచిపో!
18
సర్వశక్తిమంతుడైన దేవుడు మాకేమి చేయగలడు?’ అంటారు కాబట్టి దుర్మార్గుల ప్రణాళికలకు నేను దూరంగా ఉంటాను.
19
‘మన పగవారు నాశనమైపోయారు, వారి సంపదను అగ్ని కాల్చివేసిందని’ చెప్పుకుంటూ, ఖచ్చితంగా నీతిమంతులు వారి నాశనాన్ని చూసి సంతోషిస్తారు; నిర్దోషులు వారిని ఎగతాళి చేస్తారు.
Settings