Skip to content
యోబు 23:1-7

యోబు 23:1-7

1
అప్పుడు యోబు ఇచ్చిన జవాబు:
2
ఈ రోజు కూడా నా ఫిర్యాదు తీవ్రంగానే ఉంది; నా మూల్గుల కంటే ఆయన హస్తం నా మీద భారంగా ఉంది.
3
నేను ఆయన నివాసస్థలానికి వెళ్లగలిగేలా; ఆయన ఎక్కడ కనిపిస్తాడో నాకు తెలిస్తే బాగుండేది కదా!
4
ఆయన ఎదుటే నా ఫిర్యాదేమిటో చెప్పుకుంటాను వాదోపవాదాలతో నా నోటిని నింపుకుంటాను.
5
ఆయన నాకు ఏమి జవాబు ఇస్తారో తెలుసుకుంటాను, ఆయన నాకు చెప్పేవాటిని గ్రహిస్తాను.
6
ఆయన తన మహాబలంతో నాతో వాదిస్తారా? లేదు, ఆయన నా మనవి వింటారు.
7
అక్కడ యథార్థవంతులు ఆయన ముందు వాదించగలరు, నేను నా న్యాయాధిపతి నుండి శాశ్వతంగా విడుదల పొందుతాను.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options