Skip to content
యోబు 20:4-18

యోబు 20:4-18

4
“అనాది కాలం నుండి ఎలా ఉందో నీకు తెలుసు, భూమి మీద నరుడు ఉంచబడినప్పటి నుండి ఏమి జరుగుతున్నది నీకు తెలుసు.
5
దుర్మార్గుల ఉల్లాసం కొద్దిసేపే అని, భక్తిహీనుల సంతోషం ఒక క్షణమే ఉంటుందని నీకు తెలుసు.
6
భక్తిహీనుల గర్వం ఆకాశాలను అంటినా వారి తల మేఘాలను తాకినా,
7
వారి మలంలా వారు కూడా ఎప్పటికి కనబడకుండా నశిస్తారు; వారిని చూసినవారు, ‘వారెక్కడ ఉన్నారు?’ అని అడుగుతారు.
8
కలలా వారు చెదిరిపోయి కనుమరుగవుతారు, రాత్రి స్వప్నంలా వారు చెదిరిపోతారు.
9
వారిని చూసిన కన్ను మరలా వారిని చూడదు; వారి స్థలం వారిని మరలా చూడదు.
10
వారి పిల్లలు పేదవారి సహాయం అడుగుతారు; వారి చేతులు తమ ఆస్తిని తిరిగి ఇచ్చేస్తాయి.
11
వారి ఎముకల్లో నిండి ఉన్న యవ్వన బలం వారితో పాటు మట్టిపాలవుతుంది.
12
“చెడుతనం వారి నోటికి తీయగా ఉన్నా, నాలుక క్రింద వారు దాన్ని దాచినా,
13
భరించలేకపోయినా దాన్ని విడిచిపెట్టలేదు తమ నోటిలో భద్రం చేసుకున్నారు,
14
వారి ఆహారం వారి కడుపులో పులిసిపోతుంది; అది వారిలో నాగుపాముల విషంలా మారుతుంది.
15
వారు మ్రింగిన ఐశ్వర్యాన్ని కక్కివేస్తారు; దేవుడు వారి కడుపు లోనిది కక్కిస్తారు.
16
వారు నాగుపాముల విషాన్ని పీల్చుకుంటారు; పాము కోరలు వారిని చంపుతాయి.
17
నదిలా ప్రవహించే తేనె మీగడలు చూసి, వారు ఆనందించలేరు.
18
వారు కష్టపడి సంపాదించిన దాన్ని అనుభవించకుండానే తిరిగి ఇచ్చేస్తారు; తమ వ్యాపారంలో వచ్చిన లాభాన్ని వారు ఆస్వాదించరు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options