Skip to content
యోబు 19:13-22

సంపూర్ణ ఏకాంతము శరీరక్షయము

యోబు 19:13-22
13
“ఆయన నా సహోదరులను నాకు దూరం చేశారు; నా పరిచయస్థులందరూ నాకు పూర్తిగా పరాయివారయ్యారు.
14
నా బంధువులు నా నుండి దూరంగా వెళ్లిపోయారు; నా ప్రాణస్నేహితులు నన్ను మరచిపోయారు.
15
నా అతిథులకు నా ఇంటి పనికత్తెలకు నేను విదేశీయునిగా ఉన్నాను; పరాయివానిగా చూసినట్లు వారు నన్ను చూస్తున్నారు.
16
నేను పనివాన్ని పిలిచినా, నేను వాన్ని బ్రతిమాలినా, వాడు పలకడం లేదు.
17
నా శ్వాస కూడా నా భార్యకు అసహ్యం కలిగిస్తుంది; నా కుటుంబం నన్ను అసహ్యించుకుంటుంది.
18
చిన్నపిల్లలు కూడా నన్ను దూషిస్తున్నారు; నేను కనిపిస్తే నన్ను ఎగతాళి చేస్తున్నారు.
19
నా ప్రాణస్నేహితులంతా నన్ను అసహ్యించుకుంటున్నారు; నేను ప్రేమించినవారు నా మీద తిరగబడుతున్నారు.
20
నేను అస్థిపంజరంలా తయారయ్యాను. నా పళ్ల చిగుళ్ళ పైచర్మం మాత్రమే మిగిలి ఉంది.
21
“జాలి పడండి, నా స్నేహితులారా, నాపై జాలి చూపండి ఎందుకంటే దేవుని హస్తం నన్ను మొత్తింది.
22
దేవుడు వెంటాడినట్లు మీరు కూడా నన్నెందుకు వెంటాడుతున్నారు? నా శరీరం నాశనమైపోయింది, ఇది చాలదా?
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options