Sari la conținut
యిర్మీయా 49:28-33

కేదారు మరియు హాసోరుపై తీర్పు

యిర్మీయా 49:28-33
28
బబులోను రాజైన నెబుకద్నెజరు దాడి చేసిన కేదారు, హాసోరు రాజ్యాల గురించి: యెహోవా ఇలా అంటున్నారు: “లేవండి, లేచి కేదారు మీద దాడి చేసి తూర్పు ప్రజలను నాశనం చేయండి.
29
వారి గుడారాలు, వారి మందలు స్వాధీనం చేసుకోబడ్తాయి; వారి ఒంటెలు, వారి మొత్తం సామాగ్రితో పాటు, వారి గుడారాలను తీసుకెళ్తారు. ‘అన్నివైపులా భయమే!’ అని ప్రజలు వారితో అంటారు.
30
“త్వరగా పారిపోండి! హాసోరులో నివసించేవారలారా, లోతైన గుహల్లో దాక్కోండి” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “బబులోను రాజైన నెబుకద్నెజరు నీకు వ్యతిరేకంగా కుట్రపన్నాడు. అతడు నీకు వ్యతిరేకంగా ఒక పథకం వేశాడు.
31
“మీరు లేచి, నిర్భయంగా జీవిస్తూ, ద్వారాలు గాని అడ్డు గడియలు గాని లేకుండ ప్రజలు క్షేమంగా ఉంటున్న, దేశం మీద దాడి చేయండి,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
32
“వారి ఒంటెలు దోచుకోబడతాయి, వారి విస్తారమైన మందలు యుద్ధంలో కొల్లగొట్టబడతాయి. సుదూర ప్రాంతాలకు నలువైపులా వారిని చెదరగొట్టి వారి మీదికి అన్నివైపులా విపత్తు తెస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
33
“హాసోరు నక్కలకు నిలయంగా, ఎప్పటికీ నిర్జన ప్రదేశంగా మారుతుంది. అక్కడ ఎవరూ నివసించరు; దానిలో ఏ ప్రజలు నివసించరు.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options