Skip to content
యెషయా 8:4-10

యెషయా 8:4-10

4
ఆ పిల్లవాడు నాన్న అమ్మ అని పిలువకముందే, అష్షూరు రాజు దమస్కు సంపదని సమరయ దోపుడుసొమ్మును ఎత్తుకుని పోతాడు.”
5
యెహోవా నాతో మరలా ఇలా మాట్లాడారు:
6
“ఈ ప్రజలు మెల్లగా పారే షిలోహు నీటిని వద్దు అని, రెజీను గురించి, రెమల్యా కుమారుని గురించి సంతోషిస్తున్నారు,
7
కాబట్టి ప్రభువు భయంకరమైన యూఫ్రటీసు నది వరద నీటిని అనగా అష్షూరు రాజును, అతని బలగమంతటిని వారి మీదికి రప్పించబోతున్నారు. అవి దాని కాలువలన్నిటి నుండి ఉప్పొంగి దాని ఒడ్డులన్నిటి మీది నుండి ప్రవహిస్తాయి.
8
అవి యూదాలోకి వచ్చి పొంగిపొర్లి ప్రవహిస్తూ, గొంతు లోతు వరకు చేరుతాయి. ఇమ్మానుయేలూ, దాని చాచిన రెక్కలు నీ దేశమంతట వ్యాపిస్తాయి.”
9
దేశాల్లారా, మీరు ముక్కలై నాశనమైపోతారు! దూర దేశాల్లారా! మీరందరూ వినండి. యుద్ధానికి సిద్ధపడండి, మీరు ముక్కలై పొండి! అవును, యుద్ధానికి సిద్ధపడండి, మీరు ముక్కలై పొండి!
10
మీరు వ్యూహం రచించండి, అది విఫలమవుతుంది; మీ ప్రణాళికను ప్రతిపాదించండి, అది నిలబడదు, ఎందుకంటే దేవుడు మాతో ఉన్నారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options