కంటెంట్‌కు వెళ్లండి
యెషయా 30:8-17

ప్రజలు దేవుని వాక్యాన్ని తిరస్కరించుట

యెషయా 30:8-17
8
ఇప్పుడు వెళ్లు, రాబోయే రోజుల్లో శాశ్వతమైన సాక్షంగా ఉండేలా వారి కోసం పలక మీద దీనిని వ్రాయి వీటిని గ్రంథస్తం చేయి.
9
ఎందుకంటే వీరు తిరుగుబాటు చేసే ప్రజలు, మోసపూరిత పిల్లలు, యెహోవా హెచ్చరికకు లోబడడానికి ఇష్టపడని పిల్లలు.
10
వారు దీర్ఘదర్శులతో, “ఇకపై దర్శనాలు చూడవద్దు!” అంటారు. అలాగే ప్రవక్తలతో, “సరియైనదాని గురించి ఇకపై దర్శనాలు ఇవ్వవద్దు! అంటారు. మాకు అనుకూలమైన విషయాలు భ్రాంతి కలిగించే ప్రవచనాలు తెలియజేయండి.
11
మా దారిని వదలండి, ఈ మార్గం నుండి తొలగిపోండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి చెప్తూ మమ్మల్ని ఎదుర్కోవడం ఆపండి!”
12
కాబట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు చెప్పిన మాట ఇదే: “మీరు ఈ వర్తమానాన్ని తిరస్కరించారు, బాధించడాన్ని నమ్ముకుని, మోసాన్ని ఆధారం చేసుకున్నారు కాబట్టి,
13
ఈ పాపం మీకు బీటలు తీసి ఉబ్బిపోయిన ఎత్తైన గోడలా ఉండబోతుంది, అది ఏ క్షణమైనా కూలిపోవచ్చు.
14
అది మట్టికుండలా పగిలిపోతుంది, కరుణ లేకుండా పగులగొట్టబడుతుంది, పొయ్యిలో నుండి నిప్పు తీయడానికి గాని కుండలో నుండి నీళ్లు తీయడానికి గాని దానిలో ఒక్క పెంకు కూడా దొరకదు.”
15
ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: “పశ్చాత్తాపం, విశ్రాంతిలో మీకు రక్షణ ఉన్నది, ప్రశాంతత, నమ్మకంలో మీకు బలం లభిస్తుంది కానీ మీకు ఇవేవి లభించవు.
16
మీరు, ‘లేదు, మేము గుర్రాల మీద పారిపోతాం’ అన్నారు. కాబట్టి మీరు పారిపోతారు! మీరు, ‘మేము వేగంగా పరుగెత్తే గుర్రాల మీద స్వారీ చేస్తాం’ అన్నారు. కాబట్టి మిమ్మల్ని వెంటాడేవారు వేగంగా తరమబడతారు!
17
పర్వతంపై ఉన్న ఒక జెండా కర్రలా కొండమీద ఉన్న జెండాలా మీరు మిగిలేవరకు ఒకరు గద్దించగా మీలో వెయ్యిమంది పారిపోతారు; అయిదుగురు గద్దించగా మీరందరు పారిపోతారు.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options