Skip to content
ఎజ్రా 10:6-15

ఎజ్రా 10:6-15

6
అప్పుడు ఎజ్రా దేవుని మందిరం ఎదుట నుండి బయలుదేరి ఎల్యాషీబు కుమారుడైన యెహోహనాను గదిలోకి వెళ్లాడు. అతడు అక్కడ ఉన్నప్పుడు, ఎజ్రా అన్నపానాలు పుచ్చుకోలేదు ఎందుకంటే, చెరగొనిపోబడిన వారి నమ్మకద్రోహాన్ని బట్టి దుఃఖించాడు.
7
చెర నుండి విడుదలై వచ్చిన వారంతా యెరూషలేములో సమావేశం కావాలని యూదాలో, యెరూషలేములో ప్రకటన చేశారు.
8
ఎవరైనా మూడు రోజుల లోపు అధికారులు, పెద్దల నిర్ణయం ప్రకారం రాకపోతే, వారి ఆస్తి జప్తు చేయబడుతుంది. వారు చెర నుండి విడుదలై వచ్చిన వారి సమాజంలో నుండి వెలివేయబడతారు.
9
మూడు రోజుల్లో, యూదా, బెన్యామీను పురుషులందరు యెరూషలేములో సమకూడారు. తొమ్మిదవ నెల ఇరవయ్యవ రోజున ప్రజలందరు దేవుని మందిరం ఎదురుగా ఉన్న కూడలిలో కూర్చుని భారీ వర్షంలో తడుస్తూ ఈ విషయాన్ని బట్టి ఎంతో దిగులుతో ఉన్నారు.
10
అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి నిలబడి వారితో, “మీరు నమ్మకద్రోహులుగా ఉన్నారు; పరాయి స్త్రీలను పెళ్ళి చేసుకుని ఇశ్రాయేలీయుల దోషాన్ని ఇంకా ఎక్కువ చేశారు.
11
ఇప్పుడు మీ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించండి, ఆయన చిత్తం చేయండి. మీ చుట్టుప్రక్కల ఉన్న ప్రజల నుండి, మీ పరాయి దేశపు భార్యల నుండి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోండి” అని చెప్పాడు.
12
అప్పుడు అక్కడ చేరి ఉన్నవారందరు స్పందిస్తూ బిగ్గరగా ఇలా అన్నారు: “నీవు చెప్పింది సరియైనది! నీవు చెప్పినట్లు మేము చేయాలి.
13
అయితే ఇక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు, ఇప్పుడు చాలా పెద్ద వర్షం కురుస్తుండడం వలన మేము బయట నిలబడలేము. అంతేకాక, ఇది ఒకటి రెండు రోజుల్లో పూర్తయ్యే విషయం కాదు ఎందుకంటే, ఈ విషయంలో మేము చాలా పెద్ద తప్పు చేశాము.
14
కాబట్టి ఈ సమాజమంతటి పక్షంగా మా అధికారులు నిలబడాలి. అప్పుడు ఈ విషయంలో మన దేవుని తీవ్రమైన కోపం మన నుండి తొలగిపోయే వరకు మన పట్టణాల్లో పరాయి దేశపు స్త్రీలను పెళ్ళి చేసుకున్న ప్రతివారు నిర్ణయించిన సమయంలో ప్రతి పట్టణపు పెద్దలతో, న్యాయాధిపతులతో రావాలి.”
15
దీనిని కేవలం అశాహేలు కుమారుడైన యోనాతాను, తిక్వా కుమారుడైన యహజ్యాలు మెషుల్లాము, లేవీయుడైన షబ్బెతై అనేవారి మద్దతుతో దీన్ని వ్యతిరేకించారు.

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.

Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options