నిర్గమకాండము 21:2-11
2
“ఒకవేళ నీవు హెబ్రీ దాసులను కొంటే, వారు ఆరు సంవత్సరాలు నీకు సేవ చేయాలి. ఏడవ సంవత్సరంలో, ఏమి చెల్లించనవసరం లేకుండానే, వారు స్వేచ్ఛగా వెళ్లిపోవచ్చు.
3
అతడు వచ్చినప్పుడు ఒంటరిగా వచ్చియుంటే ఒంటరిగానే వెళ్లిపోవాలి; ఒకవేళ అతడు వచ్చినప్పుడు అతని భార్యతో వచ్చియుంటే, ఆమె తన భర్తతో వెళ్లిపోవాలి.
4
ఒకవేళ వాని యజమాని వానికి భార్యను ఇస్తే ఆమె వానికి కుమారులను లేదా కుమార్తెలను కంటే, వాడు మాత్రమే స్వతంత్రునిగా వెళ్లాలి.
5
“కాని ఒకవేళ దాసుడు, ‘నాకు నా యజమాని మీద, నా భార్య మీద నా పిల్లల మీద ప్రేమ ఉంది కాబట్టి నేను స్వతంత్రునిగా వెళ్లను’ అని అంటే,
6
వాని యజమాని వానిని దేవుని ఎదుటకు తీసుకురావాలి. వాని యజమాని వానిని తలుపు దగ్గరకు గాని ద్వారబంధం దగ్గరకు గాని తీసుకెళ్లి వాని చెవిని కదురుతో గుచ్చాలి. అప్పుడు వాడు వాని యజమానికి జీవితకాల దాసునిగా ఉంటాడు.
7
“ఒకవేళ ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మివేస్తే, ఆమె ఒక దాసుడు వెళ్లినట్లుగా స్వతంత్రంగా వెళ్లకూడదు.
8
కావాలని ఆమెను ఎన్నుకున్న యజమానిని ఆమె సంతోషపెట్టలేకపోతే, అతడు ఆమెను విడిపించబడనివ్వాలి. అతడు ఆమెను విదేశీయులకు అమ్మడానికి అతనికి అధికారం లేదు, ఎందుకంటే అతడు ఆమె నమ్మకాన్ని వమ్ముచేశాడు.
9
ఒకవేళ అతడు ఆమెను తన కుమారుని కోసం ఎంపికచేస్తే, ఆమెకు ఒక కుమార్తెకు ఇచ్చే హక్కు ఇవ్వాలి.
10
అతడు మరొక స్త్రీని పెళ్ళి చేసుకుంటే, మొదటి భార్యకు ఆహారం, బట్టలు, దాంపత్య హక్కులు లేకుండ చేయకూడదు.
11
అతడు ఈ మూడింటిని ఆమెకు సమకూర్చకపోతే, ఆమె డబ్బు ఏమి చెల్లించకుండ, స్వతంత్రురాలిగా వెళ్లిపోవచ్చు.
Settings