Skip to content
ఎస్తేరు 1:1-9

ఎస్తేరు 1:1-9

1
ఇండియా నుండి కూషు దేశం వరకు 127 సంస్థానాలను పరిపాలించిన రాజైన అహష్వేరోషు కాలంలో జరిగిన సంఘటనలు ఇవి.
2
ఆ సమయంలో అహష్వేరోషు రాజ సింహాసనం ఉన్న షూష కోట నుండి పరిపాలించాడు.
3
అతని పరిపాలనలోని మూడవ సంవత్సరంలో తన సంస్థానాధిపతులకు, అధికారులకు అందరికి విందు ఏర్పాటు చేశాడు. పర్షియా, మెదీయ సేనాధిపతులు, రాకుమారులు, సంస్థానాధిపతులు విందుకు హాజరయ్యారు.
4
నూట ఎనభై రోజులు పాటు అతడు తనకున్న విస్తారమైన రాజ్య ఐశ్వర్యం, వైభవం, ఘనత, తేజస్సు ప్రదర్శించాడు.
5
ఈ రోజులు గడిచిన తర్వాత, ఏడు రోజులపాటు రాజభవన తోటలో రాజు విందు చేశాడు, షూషనులో ఉన్న అల్పుల నుండి ఘనుల వరకు, ప్రజలందరికి అతడు విందు చేశాడు.
6
ఆ తోటలో పాలరాతి స్తంభాలకున్న వెండి ఉంగరాలకు తెలుపు నార త్రాళ్లు ఊదా రంగు పట్టీలతో తగిలించి ఉన్నాయి. తెరలు కట్టడానికి వాటి మీద వెండి కమ్ములు, అవిసెనార త్రాళ్లకు తెరలు వ్రేలాడుతున్నాయి. చలువ రాయి పాల రాయి ముత్యం ఇతర విలువైన రాళ్లు పరచిన నేల మీద వెండి బంగారాలతో అలంకరించబడిన పరుపులు ఉన్నాయి.
7
అతిథులకు బంగారు పాన పాత్రల్లో ద్రాక్షరసం వడ్డించారు, ఒక్కో పాత్ర ఒక్కో దానికి భిన్నమైనది, రాజు ధారాళ స్వభావం గలవాడు కాబట్టి ద్రాక్షరసం సమృద్ధిగా ఉంది.
8
రాజు ఆజ్ఞను బట్టి ప్రతి అతిథి కూడా ఎలాంటి పరిమితి లేకుండా త్రాగవచ్చు ఎందుకంటే వారందరికి కోరినంతగా ద్రాక్షరసం అందించమని వడ్డించే వారిని రాజు ఆదేశించాడు.
9
వష్తి రాణి కూడా తన రాజైన అహష్వేరోషు యొక్క రాజ్య భవనంలో ఉన్న స్త్రీలందరికి విందు ఏర్పాటు చేసింది.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options