Skip to content
2 థెస్సలొనీకయులకు 1:1-6

2 థెస్సలొనీకయులకు 1:1-6

1
తండ్రియైన దేవునికి యేసు క్రీస్తు ప్రభువుకు చెందిన థెస్సలొనీకయ సంఘానికి,
2
తండ్రియైన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగును గాక.
3
సహోదరీ సహోదరులారా, మేము మీ గురించి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించ వలసిందే ఎందుకంటే, మీ విశ్వాసం అంతకంతకు పెరుగుతుంది, మీ అందరికి ఒకరిపట్ల ఒకరికి ఉన్న ప్రేమ మరింత అధికమవుతూ ఉంది.
4
కాబట్టి మీరు పొందుతున్న హింసలలో శ్రమలలో మీరు చూపుతున్న ఓర్పు విశ్వాసం గురించి దేవుని సంఘాల్లో మేము గొప్పగా చెప్తున్నాము.
5
దీన్ని బట్టి దేవుడు ఇచ్చిన తీర్పు న్యాయమైనదని తెలియజేయడానికి రుజువుగా, మీరు అనుభవించిన శ్రమల వలన మీరు దేవుని రాజ్యానికి అర్హులు అవుతారు.
6
దేవుడు న్యాయవంతుడు కాబట్టి మిమ్మల్ని హింసించినవారిని తగిన విధంగా శిక్షిస్తారు,
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options