2 రాజులు 5:15-19
15
అప్పుడు నయమాను, అతని సేవకులందరు దైవజనుని దగ్గరకు తిరిగి వెళ్లారు. నయమాను అతని ఎదుట నిలబడి, “ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకంలో మరో దేవుడు లేడని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. కాబట్టి దయచేసి మీ దాసుడనైన నేను ఇచ్చే ఈ కానుక అంగీకరించండి.”
16
ప్రవక్త, “నేను సేవించే సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నేనేమి తీసుకోను” అని జవాబిచ్చాడు. నయమాను ఎంత బలవంతం చేసినా అతడు తీసుకోలేదు.
17
నయమాను ఇలా అన్నాడు, “ఒకవేళ మీరు ఒప్పుకోకపోతే, దయచేసి మీ దాసుడనైన నాకు కంచరగాడిదలు మోసేటంత మట్టి ఇప్పించండి, ఎందుకంటే యెహోవాకే దహనబలులు, అర్పణలు, అర్పిస్తాను గాని, మరి ఏ దేవునికి అర్పించను.
18
అయితే ఒక్క విషయంలో యెహోవా మీ దాసుడనైన నన్ను క్షమించాలి: నా యజమానుడు మ్రొక్కుకోడానికి రిమ్మోను గుడిలోకి వెళ్తూ నా చేయి మీద ఆనుకున్నప్పుడు నేను కూడా రిమ్మోను గుడిలో వంగి నమస్కారం చేయాల్సి వస్తుంది. కాబట్టి మీ దాసుడనైన నన్ను యెహోవా క్షమించును గాక” అని అన్నాడు.
19
ఎలీషా అన్నాడు, “సమాధానంతో వెళ్లు.” నయమాను కొద్ది దూరం వెళ్లిన తర్వాత,
Settings