కంటెంట్‌కు వెళ్లండి
2 కొరింథీయులకు 11:7-15

ఆర్థిక స్వాతంత్ర్యం, అబద్ధపు అపొస్తలుల బహిర్గతం

2 కొరింథీయులకు 11:7-15
7
దేవుని సువార్తను మీకు ఉచితంగా బోధించి, మిమ్మల్ని గొప్పవారిని చేయడానికి నన్ను నేను తగ్గించుకొని పాపం చేశానా?
8
మీకు నేను సేవ చేయడానికి ఇతర సంఘాల నుండి సహాయం పొంది వారిని దోచుకున్నాను.
9
అంతేకాక నేను మీతో ఉన్నప్పుడు నాకు సహాయం అవసరమైతే నేను ఎవరికి భారంగా లేను, ఎందుకంటే, మాసిదోనియా నుండి వచ్చిన సహోదరులే నాకు అవసరమైనవన్నీ అందించారు. నేను మీకు భారం కాకుండా ఎలా ఉన్నానో ఇకముందు కూడా అలాగే ఉంటాను.
10
నాలో క్రీస్తు సత్యం ఉన్నందుకు, అకాయ ప్రాంతాల్లో నేనిలా గర్వపడకుండ ఎవరు ఆపలేరు.
11
ఎందుకు? మీపై నాకు ప్రేమ లేదా? ఉందని దేవునికి తెలుసు!
12
గర్వించడానికి కారణం వెదికేవారు తాము గర్వించే వాటిలో మాతో సమానంగా ఉన్నామని వారు ఎంచుకోవడానికి అవకాశం లేకుండా చేయడానికి ఇప్పుడు నేను ఏమి చేస్తున్నానో అదే చేయడం కొనసాగిస్తాను.
13
అలాంటివారు అబద్ధ అపొస్తలులు, మోసపూరితమైన పనివారు, క్రీస్తు అపొస్తలుల్లా వేషం వేసుకున్నవారు.
14
ఇందులో ఆశ్చర్యం ఏమి లేదు, సాతాను కూడా వెలుగు దూత వేషం వేసుకున్నాడు.
15
కాబట్టి వాని సేవకులు కూడా నీతి సేవకుల్లా మారువేషం వేసుకోవడంలో వింత లేదు. వారి క్రియలకు తగిన అంతం వారికి ఉంటుంది.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options