2 దినవృత్తాంతములు 34:1-7
1
యోషీయా రాజైనప్పుడు అతని వయస్సు ఎనిమిది సంవత్సరాలు. అతడు యెరూషలేములో ముప్పై ఒక సంవత్సరాలు పరిపాలించాడు.
2
అతడు యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు. అతడు తన పితరుడైన దావీదు జీవిత విధానాన్ని పూర్తిగా అనుసరించాడు, దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోలేదు.
3
అతడు పాలిస్తున్న ఎనిమిదో సంవత్సరంలో ఇంకా యువకునిగా ఉండగానే తన పితరుడైన దావీదు యొక్క దేవుని వెదకడం మొదలుపెట్టాడు. పన్నెండవ సంవత్సరంలో ఉన్నత స్థలాలను అషేరా స్తంభాలను, చెక్కిన విగ్రహాలను, పోతవిగ్రహాలను తీసివేయడం, యూదాను యెరూషలేమును పవిత్రం చేయడం మొదలుపెట్టాడు.
4
అతని ఆదేశాల మేరకు ప్రజలు బయలు బలిపీఠాలను పడగొట్టారు. వాటికి పైగా ఉన్న ధూపవేదికలను సూర్యదేవతా విగ్రహాలను అతడు కూలగొట్టించాడు. అషేరా స్తంభాలను, చెక్కిన విగ్రహాలను, పోతవిగ్రహాలను ముక్కలు చేయించాడు. వాటిని చూర్ణం చేయించి, వాటికి బలులర్పించినవారి సమాధుల మీద చల్లివేశాడు.
5
ఆ దేవత పూజారుల ఎముకలను వారి బలిపీఠాల మీద కాల్పించాడు. ఈ విధంగా అతడు యూదాను, యెరూషలేమును పవిత్రం చేశాడు.
6
మనష్షే, ఎఫ్రాయిం, షిమ్యోను, నఫ్తాలి పట్టణాల వరకు వాటి చుట్టూ ఉన్న శిథిలాల్లో,
7
అతడు బలిపీఠాలను అషేరా స్తంభాలనూ, చెక్కిన విగ్రహాలను దేవతాస్తంభాలను ధ్వంసం చేశాడు. ఇశ్రాయేలు దేశమంతట్లో ధూపవేదికలన్నిటినీ సూర్య దేవత విగ్రహాలన్నిటిని ముక్కలుగా నరికి వేయించాడు. ఆ తర్వాత అతడు యెరూషలేముకు తిరిగి వచ్చాడు.
Settings