Skip to content
2 దినవృత్తాంతములు 2:3-10

తూరు రాజైన హూరామునకు సొలొమోను సహాయము కోరుట

2 దినవృత్తాంతములు 2:3-10
3
తూరు రాజైన హీరాముకు సొలొమోను ఇలా కబురు పంపాడు. “నా తండ్రియైన దావీదుకు నివాసంగా ఒక భవనం కట్టడానికి మీరు దేవదారు మ్రానులను పంపినట్లే నాకు కూడ పంపించండి.
4
ఎందుకంటే, నా దేవుడైన యెహోవా పేరిట మందిరం కట్టిస్తాను. ఆయన సన్నిధిలో పరిమళ ధూపం వేయడం కోసం, ఎల్లప్పుడూ సన్నిధి రొట్టెలు పెట్టడంకోసం, ప్రతి ఉదయం సాయంకాలం, సబ్బాతు దినాల్లో, అమావాస్యల్లో, మా దేవుడైన యెహోవాకు నియమించబడిన పండుగ సమయాల్లో దహనబలులు అర్పించడం కోసం మందిరాన్ని ఆయనకు ప్రతిష్ఠ చేస్తాను. ఇవన్నీ ఇశ్రాయేలుకు నిత్య కట్టుబాట్లుగా ఉంటాయి.
5
“మా దేవుడు ఇతర దేవుళ్ళందరికంటే గొప్పవాడు. కాబట్టి నేను కట్టించే మందిరం గొప్పగా ఉంటుంది.
6
అయితే ఆకాశ మహాకాశాలు కూడా ఆయనకు సరిపోవు. ఆయనకు మందిరం ఎవరు నిర్మించగలరు? ఆయనకు మందిరం కట్టించడానికి నా సామర్థ్యం ఏపాటిది? ఆయన సన్నిధానంలో ధూపం వేయడం కోసం ఒక స్థలాన్ని నిర్మిస్తాను.
7
“యెరూషలేములోను యూదాదేశంలోను నా దగ్గర నేర్పరులైన పనివారున్నారు. వారిని నా తండ్రి దావీదు నియమించాడు. వారితో కలిసి, బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, ఎరుపు ఊదా నూలుతోను, నీలి నూలుతోను చేసేపని, అన్ని రకాల చెక్కడం పనులు నిర్వహించడానికి నేర్పుగల ఒక మనిషిని పంపండి.
8
“లెబానోను అడవుల్లో మ్రానులు నరకడంలో మీ పనివారు నేర్పరులని నాకు తెలుసు. కాబట్టి లెబానోను నుండి నాకు సరళ వృక్షం దూలాలు, దేవదారు దూలాలు, చందనం దూలాలు పంపించండి. నా పనివారు మీ పనివారితో కలిసి పని చేస్తారు.
9
నేను కట్టే దేవాలయం విశాలంగా, అద్భుతంగా ఉండాలి కాబట్టి చాలా దూలాలు కావాలి.
10
దూలాలు నరికే మీ పనివాళ్ళకు ఆహారంగా 20,000 కోరుల గోధుమ పిండిని, 20,000 కోరుల యవలు, 20,000 బాతుల ద్రాక్షరసం, 20,000 బాతుల ఒలీవనూనె ఇస్తాను.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options