Skip to content
2 దినవృత్తాంతములు 1:3-12

2 దినవృత్తాంతములు 1:3-12

3
సొలొమోను సమాజమంతా గిబియోనులోని ఉన్నత స్థలానికి వెళ్లారు, ఎందుకంటే యెహోవా సేవకుడైన మోషే అరణ్యంలో ఏర్పాటుచేసిన దేవుని యొక్క సమావేశ గుడారం అక్కడ ఉంది.
4
దావీదు దేవుని మందసాన్ని కిర్యత్-యారీము నుండి దాని కోసం సిద్ధపరచిన స్థలానికి తీసుకువచ్చాడు, ఎందుకంటే అతడు యెరూషలేములో దాని కోసం ఒక గుడారాన్ని వేశాడు.
5
అయితే హూరు మనుమడు ఊరి కుమారుడైన బెసలేలు చేసిన ఇత్తడి బలిపీఠం గిబియోనులో యెహోవా సమావేశ గుడారం ముందు ఉంది; కాబట్టి సొలొమోను సమాజం అక్కడ అతని గురించి విచారణ చేశారు.
6
సొలొమోను సమావేశ గుడారంలో ఉన్న యెహోవా సన్నిధి ఎదుట ఉన్న బలిపీఠం దగ్గరకు వెళ్లి దానిమీద వెయ్యి దహనబలులు అర్పించాడు.
7
ఆ రాత్రివేళ దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, “నేను నీకు ఏమివ్వాలో అడుగు” అన్నారు.
8
అందుకు సొలొమోను దేవునితో, “మీరు నా తండ్రియైన దావీదు మీద ఎంతో దయను చూపించారు, అంతేకాక ఆయన స్థానంలో నన్ను రాజుగా చేశారు.
9
యెహోవా దేవా, నా తండ్రియైన దావీదుకు మీరు చేసిన వాగ్దానాన్ని స్థిరపరచండి. భూమిమీది ధూళియంత విస్తారమైన ప్రజలకు నన్ను రాజుగా చేశారు.
10
నేను ఈ ప్రజలను నడిపించడానికి నాకు జ్ఞానాన్ని, వివేచనను ఇవ్వండి. లేకపోతే మీ గొప్ప ప్రజలైన వీరిని ఎవరు పరిపాలించగలరు?”
11
దేవుడు సొలొమోనుతో, “ఇది నీ హృదయ కోరిక, నీవు సంపదలు, ఆస్తులు గాని గౌరవాన్ని గాని నీ శత్రువుల మరణాన్ని గాని నీవు కోరలేదు, నీవు సుదీర్ఘ జీవితాన్ని కోరలేదు, కానీ ఏ ప్రజల మీద నిన్ను రాజుగా చేశానో, ఆ నా ప్రజలను పరిపాలించడానికి కావలసిన జ్ఞానం కోరావు,
12
కాబట్టి నీకు జ్ఞాన వివేకాలు ఇస్తాను. అంతే కాకుండా నీకు ముందున్న ఏ రాజుకు నీ తర్వాత వచ్చే రాజులకు ఉండనంత సంపదలు, ఆస్తులు, గౌరవాన్ని నేను నీకు ఇస్తాను” అని చెప్పారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options