1 కొరింథీయులకు 16:10-19
10
తిమోతి వచ్చినప్పుడు అతడు మీ దగ్గర నిర్భయంగా ఉండేలా చూడండి. నాలాగే అతడు కూడా ప్రభువు పని చేస్తున్నాడు.
11
కాబట్టి ఎవరూ అతని పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించవద్దు. అతడు నా దగ్గరకు తిరిగి వచ్చేలా అతన్ని సమాధానంతో పంపించండి. అతడు సహోదరులతో పాటు వస్తాడని నేను ఎదురు చూస్తున్నాను.
12
మన సహోదరుడైన అపొల్లో విషయం ఏంటంటే, సహోదరులతో పాటు మీ దగ్గరకు వెళ్లమని అతన్ని నేను చాలా బ్రతిమాలాను. కాని ఇప్పుడే బయలుదేరడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. అయితే సరియైన అవకాశం లభించినపుడు అతడు వస్తాడు.
13
మెలకువగా ఉండండి; విశ్వాసంలో నిలకడగా ఉండండి; ధైర్యం కలిగి బలవంతులై ఉండండి.
14
ప్రేమ పూర్వకంగా అన్ని పనులు చేయండి.
15
స్తెఫెను అతని ఇంటివారు అకాయలో మొదటిగా క్రీస్తును స్వీకరించారని మీకు తెలుసు. వారు పరిశుద్ధుల సేవకు తమను తాము అర్పించుకున్నారు. సహోదరీ సహోదరులారా, మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను,
16
అలాంటి వారికి, వారితో పాటు పని చేసి సేవ చేసేవారికి మీరు లోబడి ఉండండి.
17
స్తెఫెను, ఫొర్మూనాతు అకాయికు అనేవారు రావడం నాకు సంతోషం ఎందుకంటే మీరు లేని కొరత వారు నాకు తీర్చారు.
18
నా ఆత్మకు, మీ ఆత్మకు కూడా వారు నూతన ఉత్తేజం కలిగించారు. అలాంటివారు గౌరవించదగినవారు.
19
ఆసియా ప్రాంతంలోని సంఘాలు మీకు తమ అభినందనలు పంపుతున్నారు. అకుల, ప్రిస్కిల్ల అనేవారు, వారి ఇంట్లో సమావేశమయ్యే సంఘం మీకు ప్రభువులో హృదయపూర్వక అభినందనలు పంపుతున్నారు.
Settings