Skip to content
1 దినవృత్తాంతములు 4:11-20

యూదా మరికొన్ని కుటుంబములు

1 దినవృత్తాంతములు 4:11-20
11
కెలూబు షూవహుకు సోదరుడు మెహీరుకు తండ్రి, మెహీరు ఎష్తోనుకు తండ్రి.
12
ఎష్తోను బేత్-రాఫాకు పాసెయకు ఈర్-నహాషు తండ్రియైన తెహిన్నాకు తండ్రి. వీరు రేకా వారసులు.
13
కెనజు కుమారులు: ఒత్నీయేలు, శెరాయా. ఒత్నీయేలు కుమారులు: హతతు, మెయానొతై.
14
మెయానొతై ఒఫ్రాకు తండ్రి. శెరాయా యోవాబుకు తండ్రి, యోవాబు గె-హరషీముకు తండ్రి, ఆ ప్రాంతంలో నిపుణులైన పనివారు ఉండేవారు కాబట్టి అలా పిలువబడింది.
15
యెఫున్నె కుమారుడైన కాలేబు కుమారులు: ఈరూ, ఏలా, నయము, ఏలా కుమారుడు: కనజు.
16
యెహల్లెలేలు కుమారులు: జీఫు జీఫా, తీర్యా, అశర్యేలు.
17
ఎజ్రా కుమారులు: యెతెరు, మెరెదు, ఏఫెరు, యాలోను. మెరెదు భార్యల్లో ఒకరికి పుట్టిన వారు మిర్యాము, షమ్మయి, ఎష్టెమో తండ్రియైన ఇష్బాహు.
18
మెరెదు పెళ్ళి చేసుకున్న ఫరో కుమార్తెయైన బిత్యా ద్వారా పుట్టిన కుమారులు వీరే. యూదు గోత్రీకురాలైన అతని భార్యకు గెదోరు తండ్రియైన యెరెదు, శోకోకు తండ్రియైన హెబెరు, జానోహ తండ్రియైన యెకూతీయేలు పుట్టారు.
19
నహము సోదరియైన హూదీయా భార్యకు పుట్టిన కుమారులు: గర్మీయుడైన కెయీలా తండ్రి, మయకాతీయుడైన ఎష్టెమో.
20
షీమోను కుమారులు: అమ్నోను, రిన్నా, బెన్-హనాను, తీలోను. ఇషీ సంతానం: జోహేతు, బెన్-జోహేతు.

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.