Skip to content
1 దినవృత్తాంతములు 18:9-13

హమాతు నుండి కానుకలు మరియు కొల్లసొమ్ము ప్రతిష్ఠ

1 దినవృత్తాంతములు 18:9-13
9
సోబా రాజైన హదదెజెరు సైన్యమంతటిని దావీదు ఓడించిన సంగతి హమాతు రాజైన తోయు విన్నప్పుడు,
10
అతడు తన కుమారుడైన హదోరామును రాజైన దావీదు దగ్గరకు అతని క్షేమం గురించి తెలుసుకుని అతనికి శుభాకాంక్షలు చెప్పడానికి పంపాడు, ఎందుకంటే హదదెజెరుకు తోయుకు మధ్య విరోధం ఉంది. హదోరాము బంగారం వెండి ఇత్తడితో చేసిన అన్ని రకాల వస్తువులను తెచ్చాడు.
11
రాజైన దావీదు ఈ వస్తువులను, ఎదోమీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు, ఫిలిష్తీయులు, అమాలేకీయుల దేశాల నుండి స్వాధీనం చేసుకున్న వెండి బంగారాలను ప్రతిష్ఠించిన విధంగానే యెహోవాకు ప్రతిష్ఠించాడు.
12
సెరూయా కుమారుడైన అబీషై ఉప్పు లోయలో 18,000 మంది ఎదోమీయులను చంపాడు.
13
అతడు ఎదోము దేశంలో సైనిక దళాలను ఉంచాడు. ఎదోమీయులంతా దావీదుకు లొంగిపోయారు. దావీదు ఎక్కడికి వెళ్లినా యెహోవా అతనికి విజయమిచ్చారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options