కంటెంట్‌కు వెళ్లండి

Uzziel గురించి బైబిల్ వచనాలు

8 వచనాలు · 6 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. కహాతు కుమారులు: అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. (కహాతు 133 సంవత్సరాలు బ్రతికాడు.)

  2. ఉజ్జీయేలు కుమారులు: మిషాయేలు, ఎల్సాఫాను, సిత్రీ.

  3. మోషే అహరోను పినతండ్రియైన ఉజ్జీయేలు కుమారులైన మిషాయేలు, ఎల్సాఫానులను పిలిపించి వారితో, “ఇక్కడకు రండి; మీ బంధువులను పరిశుద్ధాలయం ఎదుట నుండి, బయటకు తీసుకెళ్లండి” అని అన్నాడు.

  4. ఈ షిమ్యోను వంశీయులలో అయిదువందల మంది శేయీరు కొండ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. ఇషీ కుమారులైన పెలట్యా, నెయర్యా, రెఫాయా, ఉజ్జీయేలు వారికి నాయకులు.

  5. బేల కుమారులు: ఎస్బోను, ఉజ్జీ, ఉజ్జీయేలు, యెరీమోతు, ఈరీ మొత్తం అయిదుగురు. వీరు కుటుంబ పెద్దలు. తమ వంశావళి ప్రకారం యుద్ధవీరుల సంఖ్య 22,034.

  6. హేమాను కుమారుల నుండి: బక్కీయాహు, మత్తన్యా, ఉజ్జీయేలు, షెబూయేలు, యెరీమోతు; హనన్యా, హనానీ, ఎలీయాతా, గిద్దల్తీ, రోమమ్తీ-యెజెరు; యొష్బెకాషా, మల్లోతి, హోతీరు, మహజీయోతు.

  7. హేమాను సంతతి నుండి: యెహీయేలు, షిమీ, యెదూతూను సంతతి నుండి: షెమయా, ఉజ్జీయేలు.

  8. ఆ ప్రక్క భాగాన్ని కంసాలివాడైన హర్హయా కుమారుడైన ఉజ్జీయేలు బాగుచేశాడు. అతని ప్రక్కనే పరిమళద్రవ్యాలు తయారుచేసేవారిలో ఒకడైన హనన్యా బాగుచేశాడు. వారు విశాల గోడ వరకు యెరూషలేమును తిరిగి కట్టారు.