కంటెంట్‌కు వెళ్లండి

Under the Law Atonement గురించి బైబిల్ వచనాలు: Persons sinning ignorantly

16 వచనాలు · 19 కోణాలు

Persons sinning ignorantly గురించి వచనాలు

  1. పాపపరిహారబలి కోసం కోడెను చేసినట్లే దీనికి కూడా చేయాలి. ఈ విధంగా యాజకుడు సమాజానికి ప్రాయశ్చిత్తం చేస్తాడు, అప్పుడు వారు క్షమించబడతారు.

  2. తర్వాత అతడు ఎద్దును శిబిరం బయటకు తీసుకెళ్లి మొదటి ఎద్దును కాల్చినట్లుగా దానిని కాల్చాలి. ఇది సమాజం కోసం చేసిన పాపపరిహారబలి.

  3. “ ‘ఒక నాయకుడు అనుకోకుండ పాపం చేసి, తన దేవుడైన యెహోవా ఆజ్ఞలలో నిషేధించబడిన దేనినైనా చేసినప్పుడు, అతడు అపరాధి,

  4. తాను దేన్ని బట్టి పాపం చేశాడో తెలుకున్నప్పుడు అతడు లోపం లేని మేకపోతును అర్పణగా తీసుకురావాలి.

  5. అతడు మేక తలపై చేయి ఉంచి, యెహోవా ఎదుట దహనబలిని వధించిన స్థలంలో దానిని వధించాలి. ఇది పాపపరిహారబలి.

  6. అప్పుడు యాజకుడు పాపపరిహారబలి రక్తం నుండి కొంత రక్తాన్ని తన వ్రేలితో తీసుకుని దహనబలి యొక్క బలిపీఠం కొమ్ములపై పూసి మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగున పోయాలి.

  7. అతడు సమాధాన బలిపశువు క్రొవ్వును కాల్చినట్టే దీని క్రొవ్వంతా తీసి బలిపీఠం మీద కాల్చాలి. ఈ విధంగా యాజకుడు ఆ నాయకుడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తాడు, అప్పుడు అతడు క్షమించబడతాడు.

  8. “ ‘సమాజంలోని ఏ సభ్యుడైనా అనుకోకుండ పాపం చేసి, యెహోవా ఆజ్ఞలలో నిషేధించబడిన దేనినైన చేస్తే, వారు అపరాధులు,

  9. వారు చేసిన పాపం తెలియ వచ్చినప్పుడు, వారు చేసిన పాపం కోసం తమ అర్పణగా లోపం లేని ఆడ మేకను తీసుకురావాలి.

  10. వారు పాపపరిహారబలి యొక్క తలపై చేయి ఉంచి, దహనబలి చేసిన స్థలంలో దానిని వధించాలి.

  11. అప్పుడు యాజకుడు తన వ్రేలితో కొంత రక్తాన్ని తీసుకుని దహనబలి యొక్క బలిపీఠం కొమ్ములపై పూసి మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగున పోయాలి.

  12. సమాధానబలి నుండి క్రొవ్వును తీసినట్లే వారు కొవ్వంతా తీస్తారు, యాజకుడు దానిని బలిపీఠం మీద యెహోవాకు ఇష్టమైన సువాసనగా కాల్చాలి. ఈ విధంగా యాజకుడు వారికి ప్రాయశ్చిత్తం చేస్తాడు, వారు క్షమించబడతారు.

  13. “ ‘ఎవరైనా తమ పాపపరిహారబలిగా గొర్రెపిల్లను తెస్తే, వారు లోపం లేని ఆడదానిని తీసుకురావాలి.

  14. వారు దాని తలపై చేయి వేసి దహనబలిని వధించిన స్థలంలో దానిని పాపపరిహారబలిగా వధించాలి.

  15. అప్పుడు యాజకుడు పాపపరిహారబలిలో కొంత రక్తాన్ని తన వ్రేలితో తీసుకుని దహనబలి యొక్క బలిపీఠం కొమ్ములపై పూసి మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగున పోయాలి.

  16. సమాధానబలి యొక్క గొర్రెపిల్ల నుండి క్రొవ్వును తీసినట్లే వారు సమస్త క్రొవ్వును తీస్తారు, యాజకుడు దానిని యెహోవాకు సమర్పించిన హోమబలుల పైన బలిపీఠం మీద కాల్చాలి. ఈ విధంగా యాజకుడు వారు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తాడు, వారు క్షమించబడతారు.