Tribe Of Ephraim గురించి బైబిల్ వచనాలు: Predictions respecting
Predictions respecting గురించి వచనాలు
యోసేపు గురించి అతడు ఇలా అన్నాడు: “యెహోవా అతని భూమిని ఆకాశం నుండి కురిసే శ్రేష్ఠమైన మంచుతో క్రింద ఉన్న లోతైన జలాలతో దీవించును గాక;
సూర్యుని వలన కలిగే ఉత్తమమైన ఫలాలతో చంద్రుడు ఫలింపచేసే శ్రేష్ఠమైన ఫలాలతో;
పురాతన పర్వతాల శ్రేష్ఠమైన వాటితో శాశ్వత కొండల శ్రేష్ఠమైన పంటతో;
భూమి ఇచ్చే ప్రశస్తమైన పదార్థాలతో వాటి సమృద్ధితో మండుతున్న పొదలో నివసించే ఆయన దయతో దీవించును గాక. ఇవన్నీ యోసేపు తలపై ఉండును గాక, అతని సోదరుల మధ్యలో యువరాజు నుదుటి మీద ఉండును గాక.
ప్రభావంలో అతడు మొదట పుట్టిన కోడెలాంటి వాడు; అతని కొమ్ములు అడవి ఎద్దు కొమ్ములు. వాటితో అతడు జనులను, భూమి అంచులో ఉన్నవారిని కూడా కుమ్ముతాడు. ఎఫ్రాయిముకు చెందిన పదివేలమంది అలాంటివారు, మనష్షేకు చెందిన వేలమంది అలాంటివారు.”