కంటెంట్‌కు వెళ్లండి

The New Birth గురించి బైబిల్ వచనాలు: A spiritual resurrection

7 వచనాలు · 35 కోణాలు

"The New Birth" కోసం వెతకండి

A spiritual resurrection గురించి వచనాలు

  1. తండ్రియైన దేవుని మహిమ ద్వారా మరణం నుండి తిరిగి సజీవంగా లేచిన క్రీస్తువలె మనం కూడా నూతన జీవాన్ని జీవించడానికి ఆయన మరణంలో బాప్తిస్మం పొందిన మనం ఆయనతో పాటు పాతిపెట్టబడ్డాము.

  2. మనం కూడా ఆయన మరణం విషయంలో ఆయనతో ఐక్యమైతే, ఖచ్చితంగా మనం కూడా ఆయన పునరుత్థానం విషయంలో ఆయనతో ఐక్యమవుతాము.

  3. మనమింక పాపానికి బానిసలుగా ఉండకుండా పాపం చేత పాలించబడిన శరీరం నశించేలా, మన పాత స్వభావం ఆయనతో పాటు సిలువ వేయబడిందని మనకు తెలుసు.

  4. మీరైతే, మీ అతిక్రమాలలో పాపాల్లో చచ్చినవారిగా ఉండి,

  5. మనం మన అతిక్రమాలలో పాపాల్లో చచ్చినవారిగా ఉండగా, క్రీస్తుతో పాటు మనల్ని బ్రతికించారు. ఆయన కృప చేత మీరు రక్షించబడ్డారు.

  6. ఏ విధంగా అంటే, బాప్తిస్మంలో మీరు ఆయనతో పాటు పాతిపెట్టబడి, ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని క్రియలను మీరు విశ్వసించుట ద్వారా ఆయనతో పాటు మీరు కూడా మృతులలో నుండి లేచారు.

  7. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు కాబట్టి, పైనున్న వాటిపై మీ హృదయాలను ఉంచండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి వైపున కూర్చుని ఉన్నారు.