కంటెంట్‌కు వెళ్లండి

The Locust గురించి బైబిల్ వచనాలు: Of destructive enemies

8 వచనాలు · 19 కోణాలు

Of destructive enemies గురించి వచనాలు

  1. అది దట్టమైన చీకటి ఉండే దినం, అది కారు మబ్బులు గాఢాంధకారం ఉండే దినం, పర్వతాలమీద ఉదయకాంతి ప్రసరించినట్టు, బలమైన మహా గొప్ప సైన్యం వస్తుంది, అలాంటివి పూర్వకాలంలో ఎన్నడూ లేవు, ఇకమీదట రాబోయే తరాలకు ఉండవు.

  2. వాటి ముందు అగ్ని మండుతూ ఉంది, వాటి వెనుక మంటలు మండుతూ ఉన్నాయి. అవి రాకముందు భూమి ఏదెను తోటలా ఉంది, అవి వచ్చిన తర్వాత ఎండిన ఎడారిలా మారింది ఏదీ వాటినుండి తప్పించుకోలేదు.

  3. అవి గుర్రాల్లా కనిపిస్తున్నాయి; సైనికుల గుర్రాల్లా అవి పరుగెడుతున్నాయి.

  4. రథాలు కదిలే ధ్వనిలా, అగ్నిజ్వాలలు కాల్చుతున్న శబ్దంలా, యుద్ధానికి సిద్ధమైన మహా సైన్యంలా, అవి పర్వత శిఖరాల మీద దూకుతున్నాయి,

  5. వాటిని చూసి ప్రజలు వేదన చెందుతున్నారు, అందరి ముఖాలు పాలిపోతున్నాయి.

  6. అవి వీరుల్లా ముందుకు వస్తున్నాయి, సైనికుల్లా అవి గోడలెక్కి వస్తున్నాయి. అవి అటూ ఇటూ తిరుగకుండా, తిన్నగా నడుస్తున్నాయి.

  7. ఒక దానినొకటి త్రోసుకోకుండా, అన్నీ నేరుగా ముందుకు వస్తున్నాయి. వాటికి ఆయుధాలు ఎదురుపడినా, అవి వరుస మాత్రం తప్పవు.

  8. అవి పట్టణం మీదికి దూసుకు వస్తాయి. గోడ మీద పరుగెత్తుతూ వస్తాయి. దొంగలు కిటికీల నుండి చొరబడినట్లు, అవి ఇళ్ళలోనికి దూరుతున్నాయి.