కంటెంట్‌కు వెళ్లండి

The High Priest Christ గురించి బైబిల్ వచనాలు

11 వచనాలు · 21 కోణాలు

"The High Priest Christ" కోసం వెతకండి

ముఖ్య బైబిల్ వచనాలు

  1. అప్పుడు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షరసం తెచ్చాడు. అతడు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు.

  2. అతడు అబ్రామును, “భూమ్యాకాశాల సృష్టికర్త, సర్వోన్నతుడైన దేవుడు అబ్రామును దీవించును గాక,

  3. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవునికి స్తుతి కలుగును గాక” అంటూ ఆశీర్వదించాడు. అప్పుడు అబ్రాము అన్నిటిలో పదవ భాగాన్ని అతనికి ఇచ్చాడు.

  4. “తర్వాత నీవు అహరోనును అతని కుమారులను సమావేశ గుడారపు ద్వారం దగ్గరకు తీసుకువచ్చి వారిని నీటితో కడగాలి.

  5. అహరోను నాకు యాజక సేవ చేయటానికి అతనికి పవిత్ర వస్త్రాలను ధరింపజేసి, అతన్ని అభిషేకించి ప్రతిష్ఠించాలి.

  6. అతని కుమారులను తీసుకువచ్చి వారికి చొక్కాలు తొడిగించాలి.

  7. నాకు యాజక సేవ చేయటానికి వారి తండ్రిని అభిషేకించినట్లే వారిని కూడా అభిషేకించాలి. వారి అభిషేకం యాజకత్వానికి గుర్తుగా తరతరాలకు కొనసాగుతుంది.”

  8. “అహరోను, అతని కుమారులతో చెప్పు, ‘ఈ విధంగా ఇశ్రాయేలీయులను దీవించాలి:

  9. “ ‘ “యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక;

  10. యెహోవా నీ మీద తన ముఖాన్ని ప్రకాశింప జేసి నిన్ను కరుణించును గాక;

  11. యెహోవా నీవైపు తన ముఖాన్ని త్రిప్పును గాక సమాధానం ఇచ్చును గాక.” ’