Skip to content

Spitting గురించి బైబిల్ వచనాలు

7 వచనాలు · 2 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. అందుకు యెహోవా మోషేతో, “ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మివేస్తే, ఆమె ఏడు రోజులు అవమానంలో ఉండదా? ఆమెను శిబిరం బయట ఏడు రోజులు ఉంచు; ఆ తర్వాత ఆమెను వెనుకకు తీసుకురావచ్చు” అని జవాబిచ్చారు.

  2. అతని సోదరుని విధవరాలు పెద్దల సమక్షంలో అతని దగ్గరకు వెళ్లి, అతని కాలి చెప్పు ఊడదీసి అతని ముఖం మీద ఉమ్మివేసి, “తన సోదరుని కుటుంబాన్ని నిలబెట్టని వ్యక్తికి ఇలాగే జరుగుతుంది” అని చెప్పాలి.

  3. వారు నన్ను చూసి అసహ్యించుకుని దూరంగా జరుగుతున్నారు; నా ముఖం మీద ఉమ్మివేయడానికి కూడా వెనుకాడరు.

  4. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి, ఆయనను వారి పిడికిళ్ళతో గుద్దారు, మరికొందరు ఆయనను తమ అరచేతులతో కొట్టి,

  5. వారు ఆయన మీద ఉమ్మివేసి, కర్ర తీసుకుని దానితో ఆయనను తలమీద పదే పదే కొట్టారు.

  6. యేసు జనసమూహంలో నుండి వానిని ప్రక్కకు తీసుకెళ్లి, వాని చెవుల్లో తన వ్రేళ్ళను ఉంచారు. తర్వాత ఆయన ఉమ్మివేసి, వాని నాలుకను ముట్టారు.

  7. ఆయన ఆ గ్రుడ్డివాని చేయి పట్టుకుని ఊరి బయటకు తీసుకెళ్లి, వాని కళ్ల మీద ఉమ్మివేసి, వాని మీద చేతులుంచి, “నీకు ఏమైనా కనబడుతుందా?” అని అడిగారు.