Sensuality గురించి బైబిల్ వచనాలు: General references
General references గురించి వచనాలు
మనుష్యులు అన్నపానాలు పుచ్చుకుని తమ కష్టార్జితంతో మేలుపొందడం కంటే క్షేమం ఇంకేముంది? అయినా ఇది కూడా దేవుని వలనే కలుగుతుందని నేను తెలుసుకున్నాను.
కాబట్టి జీవితాన్ని ఆనందించడాన్ని నేను అభినందిస్తున్నాను, ఎందుకంటే సూర్యుని క్రింద ఉన్నవారు తిని త్రాగి సంతోషించడం కన్నా గొప్పది లేదు. అప్పుడు దేవుడు సూర్యుని క్రింద వారికి ఇచ్చిన జీవితకాలంలో వారి కష్టంలో వారికి తోడుగా ఉండేది ఆ సంతోషమే.
యవ్వనులారా మీరు, మీ యవ్వన దశలో మీరు సంతోషించండి, మీ యవ్వన దినాల్లో మీ హృదయాన్ని సంతోషంగా ఉండనివ్వండి మీ హృదయ కోరుకున్న వాటిని మీ కళ్లు చూసే వాటిని అనుభవించండి, కాని వీటన్నిటిని బట్టి దేవుడు మిమ్మల్ని తీర్పులోకి తెస్తారని తెలుసుకోండి.
కాని మీరు, “రేపు చనిపోతాం కాబట్టి మనం తిని త్రాగుదాం” అని చెప్పి, పశువులను నరుకుతూ గొర్రెలను చంపుతూ, మాంసం తింటూ, ద్రాక్షరసం త్రాగుతూ, మీరు సంతోషించి ఉల్లసిస్తారు.
వారు, “రండి, నేను ద్రాక్షరసం తెప్పిస్తాను మనం తృప్తిగా మద్యం త్రాగుదాం! ఈ రోజులానే రేపు ఉంటుంది, ఇంకా మంచిగా ఉంటుంది” అంటారు.
నా ఆత్మతో నేను ఇలా అనుకుంటాను, “అనేక సంవత్సరాలకు సరిపడినంత విస్తారమైన ధాన్యం నీకోసం సమకూర్చి ఉంచాను. జీవితాన్ని తేలికగా తీసుకో; తిను, త్రాగు, సంతోషంగా ఉండు” ’ అని అనుకున్నాడు.
“కాని దేవుడు అతనితో, ‘ఓయీ బుద్ధిహీనుడా! ఈ రాత్రే నీ ప్రాణం పోతే, నీకోసం నీవు సిద్ధపరచుకొన్నది ఎవరిదవుతుంది?’
“అందుకు అబ్రాహాము, ‘కుమారుడా, జ్ఞాపకం చేసుకో, లాజరు కష్టాలను అనుభవిస్తున్నప్పుడు నీ జీవితంలో నీవు మేళ్ళను అనుభవించావు, కానీ ఇప్పుడు ఇక్కడ అతడు ఆదరణ పొందుతున్నాడు, కానీ నీవు యాతనపడుతున్నావు.
కాని, కేవలం మానవరీతిగా ఎఫెసులోని మృగాలతో నేను పోరాడితే నాకు లాభమేంటి? ఒకవేళ మరణించినవారు లేపబడకపోతే, “రేపు చనిపోతాం కాబట్టి, మనం తిని త్రాగుదాం.”
మోసపోకండి: “దుష్టులతో సహవాసం మంచి ప్రవర్తనను పాడుచేస్తుంది.”
మీరు భూమిపై విలాసవంతంగా సుఖంగా జీవించారు; సంహార దినాన మీ హృదయాలను మిమ్మల్ని మీరు పోషించుకున్నారు.
“అంత్యదినాలలో తమ చెడు కోరికలనే అనుసరించే అపహాసకులు ఉంటారు” అని వారు మీకు చెప్పారు.
అలాంటివారు సహజ సంబంధులు, వీరు ఆత్మలేనివారిగా ఉండి, మీలో విభేదాలు పుట్టిస్తారు.