Science గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
శూన్యమండలంపైన ఉత్తరాన ఆకాశాలను ఆయన విశాలపరిచారు; శూన్యంలో భూమిని వేలాడదీసారు.
ఆయన తన మేఘాలలో నీళ్లను బంధించారు అయినా వాటి బరువుకు మేఘాలు చినిగిపోవు.
దాని మీద మేఘాలను వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచారు.
వెలుగు చీకట్ల సరిహద్దు వరకు జలాలకు ఆయన హద్దును నియమించారు.
ఆయన గద్దింపుకు ఆకాశాల స్తంభాలు కంపిస్తాయి.
ఆయన బలం చేత సముద్రం ఉప్పొంగుతుంది; తన జ్ఞానం చేత రాహాబును ముక్కలుగా చేస్తారు.
ఆయన ఊపిరిచే ఆకాశాలు అలంకరించబడతాయి; ఆయన చేయి పారిపోతున్న సర్పాన్ని పొడిచింది.
ఇవన్నీ ఆయన చేసినపనులలో కొంతవరకు మాత్రమే; మనం ఆయన గురించి విన్నది కేవలం గుసగుస ధ్వని వంటిది మాత్రమే! అలాంటప్పుడు ఆయన శక్తి యొక్క ఉరుమును గ్రహించగలిగిన వారెవరు?”
ఆకాశం క్రింద జరుగుతున్నదంతా అధ్యయనం చేయడానికి జ్ఞానంతో పరిశోధించడానికి దానిపై మనస్సు పెట్టాను. దేవుడు మనుష్యులపై ఎంతో అధికమైన భారం పెట్టారు!
సూర్యుని క్రింద జరిగే వాటన్నిటిని నేను చూశాను; అవన్నీ అర్థరహితమే, అది గాలి కోసం ప్రయాసపడడమే.
వంకరగా ఉన్నవాటిని సరి చేయలేము; లేనివాటిని లెక్కపెట్టలేము.
“చూడు, యెరూషలేములో నాకన్నా ముందు పాలించిన రాజులందరికంటే నేను గొప్పజ్ఞానిని; ఎంతో జ్ఞానాన్ని తెలివిని సంపాదించాను” అని నాలో నేను అనుకున్నాను.
ఏది జ్ఞానమో, ఏది వెర్రితనమో ఏది అవివేకమో గ్రహించాలని ప్రయత్నించాను. కాని అది కూడా, గాలి కోసం ప్రయాసపడడమే అని తెలుసుకున్నాను.
“ధర్మశాస్త్ర నిపుణులారా మీకు శ్రమ, ఎందుకంటే మీరు జ్ఞానానికి చెందిన తాళపు చెవిని తీసివేసుకున్నారు. మీరే దానిలో ప్రవేశించలేదు, పైగా ప్రవేశిస్తున్న వారిని ఆటంకపరిచారు.”
చీకటిలో ఉన్నవారికి వెలుగు అని, మూర్ఖులకు బోధకులు అని, చిన్న పిల్లలకు గురువులు అని మీకు మీరు అనుకుంటే, ఎందుకంటే ధర్మశాస్త్రంలో జ్ఞానం సత్యం మిళితమై ఉన్నాయి
తిమోతీ, నీకు అప్పగించబడిన బోధను జాగ్రత్తగా పాటించు. దుష్టమైన వట్టి మాటలకు, జ్ఞానమని తప్పుగా పిలువబడే విరుద్ధమైన ఆలోచనలకు దూరంగా ఉండాలి.