Sanctuary గురించి బైబిల్ వచనాలు: The holy place in the temple
The holy place in the temple గురించి వచనాలు
ప్రభువు తన బలిపీఠాన్ని తిరస్కరించి, తన పరిశుద్ధాలయాన్ని విడిచిపెట్టారు. ఆయన ఆమె రాజభవనాల గోడలను శత్రువుల చేతికి అప్పగించారు; నియామక పండుగ రోజున చేసినట్టుగా వారు యెహోవా నివాసంలో బిగ్గరగా కేకలు వేశారు.
“చూడండి, యెహోవా, ఆలోచించండి: మీరు ఇంతకుముందు ఎవరితోనైనా ఇలా వ్యవహరించారా? స్త్రీలు తమ సంతానాన్ని తినాలా, తాము పెంచిన పిల్లలను తినాలా? యాజకుడు, ప్రవక్త ప్రభువు యొక్క పరిశుద్ధాలయంలో చంపబడాలా?
అతడు ఆ స్థలాన్ని నాలుగు వైపులా కొలిచాడు. పరిశుద్ధ స్థలాన్ని సాధారణ స్థలాన్ని వేరు చేయడానికి దాని చుట్టూ అయిదువందల మూరల పొడవు అయిదువందల మూరల వెడల్పు గల ఒక గోడ ఉంది.