Sacrifices గురించి బైబిల్ వచనాలు: Required to be perfect and without blemish
Required to be perfect and without blemish గురించి వచనాలు
ఆ అర్పణ అంగీకరించబడేలా పశువుల మందలో నుండి గాని గొర్రె మేకల మందలో నుండి గాని లోపం లేని మగదాన్ని అర్పించాలి.
ఆ జంతువుల్లో లోపం అంటే అది కుంటిదైనా గ్రుడ్డిదైనా లేదా వేరే ఏదైన లోపం ఉంటే మీరు దానిని మీ దేవుడైన యెహోవాకు అర్పించకూడదు.
మీ దేవుడైన యెహోవాకు మచ్చ గాని లోపంగాని ఉన్న ఎద్దునైనా గొర్రెనైనా బలిగా అర్పించకూడదు, అది మీ దేవుడైన యెహోవాకు అసహ్యము.
మీరు గ్రుడ్డి జంతువులను తెచ్చి బలి అర్పిస్తే తప్పు కాదా? కుంటి దానిని, జబ్బుతో ఉన్న జంతువులను తెచ్చి బలి అర్పిస్తే తప్పు కాదా? అలాంటి వాటిని మీ అధికారికి ఇచ్చి చూడండి! అలాంటివి ఇస్తే స్వీకరిస్తాడా? అతడు నిన్ను అంగీకరిస్తాడా?” అని సైన్యాల యెహోవా అంటున్నారు.
“తన మందలో అంగీకారయోగ్యమైన మగ జంతువు ఉండి, దానిని బలి ఇస్తానని మ్రొక్కుబడి చేసి దోషం ఉన్న జంతువును బలి అర్పించే మోసగాడు శాపగ్రస్తుడు. ఎందుకంటే నేను గొప్ప రాజును, దేశాలకు నేనంటే భయం” అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.