Skip to content

Rameses గురించి బైబిల్ వచనాలు

5 వచనాలు · 2 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. కాబట్టి యోసేపు తన తండ్రిని, తన సోదరులను ఈజిప్టులో స్థిరపరచి, దేశంలో శ్రేష్ఠమైన భాగంలో, ఫరో చెప్పినట్టు రామెసేసు జిల్లాను వారికి స్వాస్థ్యంగా ఇచ్చాడు.

  2. కాబట్టి వారిని అణచివేయాలని వారితో వెట్టిచాకిరి చేయించడానికి వారిపై బానిస యజమానులను నియమించారు, ఫరో కోసం పీతోము రామెసేసు అనే రెండు పట్టణాలను గిడ్డంగులుగా కట్టారు.

  3. అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసునుండి సుక్కోతుకు ప్రయాణమై వెళ్లారు. వారిలో స్త్రీలు పిల్లలు కాకుండా కాలినడకన ఉన్నవారు ఆరు లక్షలమంది పురుషులు.

  4. ఇశ్రాయేలీయులు మొదటి నెల పదిహేనవ రోజు అంటే పస్కా తర్వాత రోజున, రామెసేసు నుండి ప్రయాణమయ్యారు. యెహోవా హతం చేసిన తమ జ్యేష్ఠులందరిని ఈజిప్టువారు సమాధి చేస్తూ ఉన్నప్పుడు, వారు చూస్తూ ఉండగా జయోత్సాహంతో బయలుదేరారు; ఎందుకంటే యెహోవా వారి దేవుళ్ళ మీద తీర్పు తీర్చారు.

  5. ఇశ్రాయేలీయులు రామెసేసును వదిలి సుక్కోతు దగ్గర దిగారు.