Priscilla గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
ఆ తర్వాత, పౌలు ఏథెన్సు పట్టణం నుండి కొరింథీ పట్టణానికి వెళ్లాడు.
అక్కడ పొంతు అనే ప్రాంతానికి చెందిన అకుల అనే ఒక యూదుడు తన భార్య ప్రిస్కిల్లతో కలిసి, యూదులందరు రోమా ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోవాలనే క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞమేరకు ఇటలీ దేశం నుండి కొరింథీ పట్టణానికి వచ్చాడు. పౌలు వాళ్ళను చూడటానికి వెళ్లాడు.
పౌలు కూడా వారిలా డేరాలను తయారుచేసేవాడు, కాబట్టి అతడు వారితో నివసిస్తూ కలిసి పని చేశాడు.
పౌలు మరికొన్ని రోజులు కొరింథీలోనే గడిపాడు. తర్వాత అక్కడి సహోదర సహోదరీల దగ్గర సెలవు తీసుకుని, అకుల ప్రిస్కిల్లతో కలిసి ఓడలో సిరియా దేశానికి వెళ్లాడు. అతడు ప్రయాణానికి ముందు తాను చేసుకొన్న మ్రొక్కుబడి ప్రకారం తన తల వెంట్రుకలను కెంక్రేయలో కత్తిరించుకున్నాడు.
వారు ఎఫెసుకు చేరుకున్నాక, పౌలు అకుల ప్రిస్కిల్లను అక్కడ విడిచిపెట్టాడు. తాను ఒక్కడే సమాజమందిరంలోనికి వెళ్లి యూదులతో తర్కించేవాడు.
అతడు సమాజమందిరంలో ధైర్యంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అకుల ప్రిస్కిల్లలు అతని మాటలను విని, అతన్ని తమ ఇంటికి ఆహ్వానించి దేవుని మార్గం గురించి మరింత పూర్తిగా అతనికి వివరించారు.
యేసు క్రీస్తులో నా తోటిపనివారైన అకుల ప్రిస్కిల్లకు వందనాలు తెలియజేయండి.
వారు నా కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టారు. నేనే కాదు యూదేతరుల సంఘాల వారందరు వారికి కృతజ్ఞులై ఉన్నారు.
ఆసియా ప్రాంతంలోని సంఘాలు మీకు తమ అభినందనలు పంపుతున్నారు. అకుల, ప్రిస్కిల్ల అనేవారు, వారి ఇంట్లో సమావేశమయ్యే సంఘం మీకు ప్రభువులో హృదయపూర్వక అభినందనలు పంపుతున్నారు.
అకుల ప్రిస్కిల్లకు, ఒనేసిఫోరు ఇంటి వారందరికి నా వందనాలు.